• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KHAMMAM TRS LEADERS TUMMALA PONGULETI WAITING FOR KCR DECISION AK

ఆ ఇద్దరు నేతలను కేసీఆర్ కరుణిస్తారా ?

ఆ ఇద్దరు నేతలను కేసీఆర్ కరుణిస్తారా ?

సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా ఉన్న తుమ్మల, పొంగులేటికి కేసీఆర్ ఎలాంటి పదవులు ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పదవులు ఇస్తారో ఊహించడం కష్టం. వీరికి పదవులు రావడం కష్టమని అనుకున్న వాళ్లు సైతం... కేసీఆర్ నిర్ణయంతో మంచి పదవులు దక్కించుకుంటారు. అలా ఎమ్మెల్యేగా గెలవకముందే గతంలో కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఆ తరువాత ఎన్నికల్లో ఓటమి కారణంగా... ఆయన టీఆర్ఎస్‌లో పూర్తిగా సైలెన్స్ అయిపోయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల శకం ముగిసినట్టే అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇంతే.

    ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం రాకపోవడంతో పాటు ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారంటూ కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా... టీఆర్ఎస్ ఎంపీగా నామా గెలుపు కోసం కృషి చేశారు. ఆ రకంగా తనపై కేసీఆర్‌కు ఉన్న ఆగ్రహాన్ని కొంతమేర తగ్గించుకోవడంలో విజయం సాధించారు.

    ఇలా ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా ఉన్న తుమ్మల, పొంగులేటికి కేసీఆర్ ఎలాంటి పదవులు ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరికి రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ వీరిలో ఒకరికి ఆ ఛాన్స్ ఇస్తారా ? లేక ఇద్దరిని మళ్లీ వెయిటింగ్‌లో పెడతారా ? అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: