Khammam Lok Sabha Election | బొంతలకు పనికిరాని చీరలను బతుకమ్మ కానుకగా ఇచ్చి కేసీఆర్ మా ఆడవాళ్ల పరువు తీశారంటూ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ధ్వజమెత్తారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మధ్య ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన నామా విజయం కోసం స్థానిక టీఆర్ఎస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అటూ రేణుకా చౌదరి ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే...ఆయన నియోజకవర్గ ప్రజలకు పంగనామాలు పెట్టడం ఖాయమని రేణుకా చౌదరి అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టిఆర్ఎస్ పార్టీకి హస్తంతో పంగనామలు పెట్టవచ్చు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఏన్కూర్ లో రోడ్ షో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కి సుబాబుల్ రైతులు పంటలు కొనుగోలు గురించి తెలియదు గాని ఎమ్మెల్యేల కొనుగోలు గురించి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. బొంతలకు పనికిరాని చీరలను బతుకమ్మ కానుకగా ఇచ్చి కేసీఆర్ మా ఆడవాళ్ల పరువు తీశారంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.