• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • KEY CWC MEET TODAY IN DELHI AS SONIA GANDHI INSISTS ON QUITTING AS PARTY CHIEF NK

CWC Meet: నేడు CWC మీటింగ్... సోనియాగాంధీ రిజైన్ చేసే ఛాన్స్

CWC Meet: నేడు CWC మీటింగ్... సోనియాగాంధీ రిజైన్ చేసే ఛాన్స్

CWC Meet: నేడు CWC మీటింగ్... సోనియాగాంధీ రిజైన్ చేసే ఛాన్స్

Congress Party: కాంగ్రెస్ పార్టీలో సంచలన మార్పులు ఇవాళ వచ్చేలా కనిపిస్తున్నాయి. వాడివేడిగా జరిగే CWC మీటింగ్‌లో... కొత్త అధినేతను ఎన్నుకునే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

 • Share this:
  Congress Party: జాతీయ కాంగ్రెస్ పార్టీలో... అంతర్గతంగా ఉన్న లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘోరంగా ఓడిపోవడంతో... పార్టీ నాయకత్వ పటిమపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు. యువనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మారిన సీనియర్లంతా... పార్టీలో పెను మార్పులు రావాలనీ... అధినేత్రి సోనియా స్థానంలో ఇంకెవరినైనా అధినేతగా నియమించాలనే సంకేతాలివ్వడం పెను ప్రకంపనలకు దారితీసింది. సరిగ్గా ఇవాళ CWC మీటింగ్ జరగనుండగా... సీనియర్లు ఇలా నిరసన గళాలు వినిపించడంతో... ఇక అధినేత్రి సోనియాగాంధీ... ఇవాళ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మొదటి నుంచి పదవులపై వ్యామోహం లేని ఆమె... తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవిని చేపట్టారు. మరో చీఫ్‌ని ఎన్నుకోమని ఇదివరకే చెప్పినా... అప్పట్లో ఎవరూ ఆ సాహసం చెయ్యలేదు. ఇప్పుడు మాత్రం... యువత సపోర్ట్ కాంగ్రెస్‌కి దూరమైపోతోందనే ఉద్దేశంతో... మార్పులు రావడమే బెటరనే అభిప్రాయానికి సీనియర్లు వచ్చేశారు. ఐతే... ఈ మొత్తం ఎపిసోడ్‌లో తమ ఫ్యామిలీపైనే వ్యతిరేకత రావడంపై... రాహుల్ గాంధీ తీవ్ర నిరాశ చెందినట్లు తెలిసింది.

  తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగే ఉద్దేశం లేదని నిన్న మరోసారి చెప్పిన సోనియాగాంధీ మరో చీఫ్‌ని ఎంచుకోమని మరోసారి చెప్పేశారు. ఇందుకు టైమ్ పట్టే అవకాశాలున్నాయి. కానీ సోనియా గాంధీ ఇవాళే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే... మరి నెక్ట్స్ ఎవరన్నది సవాలుగా మారుతోంది. ఇప్పటికీ రాహుల్ గాంధీయే చీఫ్ అవ్వాలని కొంతమంది కోరుతుంటే... ఇష్టంలేనప్పుడు రాహుల్‌ని ఎంపిక చేసి, ఇబ్బంది పెట్టే బదులు... ఇంకెవరినైనా ఎంపిక చేసుకోవడం బెటరనే వాదనలు కూడా కొంత మంది సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో... ఇవాళ్టి CWC మీటింగ్... వేడి వేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

  1999లో సోనియా గాంధీ పార్టీ చీఫ్ అయినప్పుడు... ఆమె విదేశీయురాలంటూ... శరద్ పవార్... కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. సీనియర్లు తమ అయిష్టత తెలుపుతూ... సోనియాకు లేఖ పంపిన క్షణం నుంచే ఆమె చీఫ్ పదవిలో ఉండేందుకు ఇష్టంగా లేరని తెలుస్తోంది. తన అయిష్టత తెలుపుతూ ఆమె రాసిన ఓ సందేశ లేఖను ఇవాళ CWC మీటింగ్‌లో పార్టీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ చదవుతారని తెలుస్తోంది.

  2019లో కాంగ్రెస్ రెండోసారి ఘోరంగా ఓడాక... దానికి బాధ్యత వహిస్తూ... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ సోనియాయే ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఆగస్ట్ 10 నాటికి సోనియా... తాత్కాలిక అధ్యక్షురాలిగా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఇవాళ్టి మీటింగ్‌లో మూడు వాదనలు వినిపించే ఛాన్సుంది. సోనియాయే కొనసాగాలని ఓ వాదన, రాహుల్‌కి అప్పగించాలనే మరో వాదన, గాంధీయేతర ఫ్యామిలీలో ఒకరికి ఇవ్వాలనే మూడో వాదన వినిపించే ఛాన్సుంది. రాహుల్ మాత్రం చీఫ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సోనియాకి ఆరోగ్యం సహకరించట్లేదు. ఐతే... సీనియర్లు బలంగా కోరితే... మరో చీఫ్‌ని వెతుక్కునే వరకూ... మరికొన్నాళ్లు సోనియా కొనసాగే ఛాన్స్ ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఎక్కువ మంది కోరితే... ప్రియాంకా గాందీ వాద్రా... పార్టీ చీఫ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

  సోనియా కుటుంబానికి కాకుండా మరెవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... అప్పుడు కాంగ్రెస్... గాంధీ కుటుంబం నుంచి వేరే వారి చేతిలోకి వెళ్లినట్లవుతుంది. ఇలా జరిగితే... అధి కాంగ్రెస్‌కి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అవుతుందనే అభిప్రాయమూ ఉంది. తాజాగా సీనియర్లు పంపిన లేఖపై సంతకం చేసినవారిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ, శశిథరూర్ వంటివారున్నారు. CWC సభ్యులైన ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు... భూపీందర్ సింగ్ హుడా, రాజేందర్ కౌల్ భట్టాల్, ఎం వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, పీజే కురియన్, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిళింద్ దేవరా... ఇలా చాలా మంది ఉన్నారు. వీరిలో శశిథరూర్‌కి సింహాసనం అప్పగిస్తారనే వాదన కొంతవరకూ వినిపిస్తోంది.
  Published by:Krishna Kumar N
  First published: