Home /News /politics /

KERALA HINDU GROUPS SEE RED AFTER COLLEGE MAGAZINE CALLS SABARIMALAS FIRST FEMALE ENTRANTS AS HEROINES BS

శబరిమల ఆలయంలోకి మహిళలు.. వాళ్లు హీరోయిన్లు అన్న కాలేజీ మేగజైన్.. రచ్చ రచ్చ..

శబరిమల ఆలయం (ఫైల్ ఫొటో)

శబరిమల ఆలయం (ఫైల్ ఫొటో)

Sabarimala: బిందు, కనకదుర్గ.. హీరోయిన్లు అంటూ కేరళలోని మార్ అథనేషియస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తాజాగా తన మేగజైన్‌లో ప్రచురించింది. దీనిపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అది జనవరి 2, 2019.. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయం.. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలో అడుగు పెట్టారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంతో వీరిద్దరు ఆలయంలోకి అడుగుపెట్టారు. అయితే, సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ బీజేపీతో పాటు, దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ట్రావెన్‌కోర్ బోర్డు కూడా వారికి మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దూమారం చెలరేగింది. అసలు విషయానికి వస్తే.. బిందు, కనకదుర్గ.. హీరోయిన్లు అంటూ కేరళలోని మార్ అథనేషియస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తాజాగా తన మేగజైన్‌లో ప్రచురించింది. దీనిపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కాలేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసి, హిందువులను రెచ్చగొట్టేలా కాలేజీ మేగజైన్‌లో ప్రచురణలు చేసిందని హిందూ ఐక్య వేదిక, మరో హిందూ సంస్థ ఆరోపించాయి. కాలేజీ విద్యార్థులు ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని హెచ్చరించాయి. మేగజైన్ ఎడిటర్‌పైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.

ఈ వివాదంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. మేగజైన్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఒక వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది మేగజైన్ ఉద్దేశం కాదని కాలేజీ ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. మేగజైన్‌లో ప్రచురించిన ఆర్టికల్.. కాలేజీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Kerala, Sabarimala Temple, Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు