• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • KERALA GOLD SMUGGLING CASE SWAPNA SURESH NAMES CM PINARAYI VIJAYAN AND THREE CABINET MINISTERS SK

Kerala: ఎన్నికల వేళ కేరళలో ప్రకపంనలు.. సీఎం మెడకు గోల్డ్ స్కామ్ ఉచ్చు.. నెక్ట్స్ ఏంటి?

కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ సీఎం పినరయిజ విజయన్, యూఏఈ కాన్సులేట్ జనరల్ మధ్య జరిగిన చర్చల్లో స్వప్న సురేష్ మధ్యవర్తిగా ఉన్నారని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. సీఎం విజయన్‌కు అరబిక్ మాట్లాడం, అర్ధం చేసుకోవడం రానందున... స్వప్న సురేష్ కీలక భూమిక పోషించినట్లు తెలిపారు.

  • Share this:
    కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ గోల్డ్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసుల సీఎం పినరయి విజయన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్పప్న సురేష్ కస్టమ్స్ విచారణలో సంచలన విషయాలు చెప్పారు. స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం విజయన్ పాత్ర ఉందని నిందితురాలు స్వప్న సురేష్ బాంబు పేల్చారు. సీఎంతో పాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ పాత్ర కూడా ఉందని కస్టమ్స్ విచారణలో వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా హైకోర్టుకు కస్టమ్స్ అధికారులు నివేదిక సమర్పించారు.

    కేరళ సీఎం పినరయిజ విజయన్, యూఏఈ కాన్సులేట్ జనరల్ మధ్య జరిగిన చర్చల్లో స్వప్న సురేష్ మధ్యవర్తిగా ఉన్నారని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. సీఎం విజయన్‌కు అరబిక్ మాట్లాడం, అర్ధం చేసుకోవడం రానందున... స్వప్న సురేష్ కీలక భూమిక పోషించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సీఎంతో పాటు మంత్రులకు భారీగా కమిషన్లు ముట్టాయని స్వప్న సురేష్ చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సీఎం కేసు బయటకు రావడంతో కేరళ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గతంలో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని విపక్ష నేత రమేష్ చెన్నితాల విమర్శించారు.

    కాగా, గత ఏడాది జూలై 5న యూఏఈ నుంచి దౌత్య మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని కొచ్చి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ 14.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డిప్లమాటిక్ కార్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం తరలించడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏ, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌లు విడివిడిగా విచారణ చేపట్టాయి. ఈ కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేటులో మాజీ ఉద్యోగులైన స్వప్న సురేష్‌, పీఎస్ సరిత్‌తో పాటు మరికొందరు నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి.

    ఈ కేసులో స్వప్న సురేష్ పేరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శికి ఎం శివశంకర్‌కు ఆమెతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక శివశంకర్ బెయిల్‌ను ఛాలెంజ్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున, దానిపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వేళ సీఎం పేరు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడులైన విషయం తెలిసిందే. కేరళతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాల ఫలితాలతో పాటు కేరళ ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: