• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • KERALA ELECTION RESULTS LIVE UPDATES LDF TO WIN AGAIN PREDICT EXIT POLLS SSR

Kerala Election Results: కేరళలో బీజేపీకి ఈసారి కూడా.. ఎగ్జిట్‌పోల్స్ గానీ నిజమైతే...

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఎన్నికల్లో కూడా విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్‌కే ప్రజలు పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టూడేస్ చాణక్య, యాక్సిస్- మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వందకు పైగా స్థానాల్లో ఎల్డీఎప్ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.

  • Share this:
    Kerala Election Results Live Updates: కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్‌కే ప్రజలు పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టూడేస్ చాణక్య, యాక్సిస్- మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వందకు పైగా స్థానాల్లో ఎల్డీఎప్ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. సీ ఓటర్, సీఎన్‌ఎక్స్ మాత్రం ఎల్డీఎఫ్‌కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు మధ్య పోటీ ఉంటుందని.. కానీ ఎల్డీఎఫ్ అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేశాయి. కేరళలో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని.. ఎగ్జిట్ పోల్స్ ‌ను చూస్తే అర్థమవుతోంది. కేరళ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు పార్టీలు నిలిచాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాయి. కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 71. పినరయి విజయన్ పోటీ చేసిన నియోజకవర్గం ధర్మదం. ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పద్మనాభన్.

    కేరళలో ఒక్కసారి 2016 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఎల్డీఎఫ్ గెలిచిన స్థానాలు 91. యూడీఎఫ్ గెలిచిన స్థానాలు 47. బీజేపీ ఒకేఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. 2021 ఎన్నికల సమయానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. శబరిమలలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అధికార ఎల్డీఎఫ్ ప్రవర్తించిందని విమర్శలు మూటగట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ రెండు అంశాలనే ఎన్నికల ప్రచారంలో ఎల్డీఎఫ్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు వినియోగించుకున్నాయి. దీనికి తోడు.. కేరళలో రాజకీయ హత్యలు పెరిగిపోయాయని, హింస పెరిగిపోయిందని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వివరించింది.

    Election Results 2021 Live Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ముఖ్యమంత్రిని గోల్డ్ స్మగ్లింగ్ కేసు ముప్పతిప్పలు పెట్టిందని చెప్పక తప్పదు. ఈ కేసులో సీఎం దగ్గర పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. కేరళ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయడం విశేషం.
    Published by:Sambasiva Reddy
    First published: