హోమ్ /వార్తలు /రాజకీయం /

ఉద్రిక్తంగానే శబరిమల, కేరళలో కొనసాగుతున్న బంద్

ఉద్రిక్తంగానే శబరిమల, కేరళలో కొనసాగుతున్న బంద్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేరళలో శబరిమల ఆలయ పరిస్థితి, సుప్రీంకోర్టు తీర్పుకి ముందు, తీర్పు తర్వాత అన్నట్లు తయారైంది. తీర్పుకి ముందు ఎంత ప్రశాంతంగా ఉండేదో, తీర్పు తర్వాత అంతలా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ శబరిమల కర్మ సమితి సహా కొన్ని సంస్థలు కేరళ బంద్‌కి పిలుపివ్వడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  సంఘ్‌ పరివార్‌ సీనియర్‌ నేత అయిన ఓ మహిళను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ, కేరళ బంద్‌కి పిలుపిచ్చింది శబరిమల కర్మ సమితి. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు హిందూ ఐక్యవేది రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను ఆందోళన చేస్తూ, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో పోలీసులు అరెస్ట్‌ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 50 ఏళ్లు దాటిన ఆమె, ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌జేఆర్‌ కుమార్‌ ఆరోపించారు.

  మండల-మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం ప్రారంభించిన ఆలయం 41 రోజులపాటూ తెరిచి వుంటుంది. బంద్‌ కారణంగా అత్యవసర సేవలకు, అయ్యప్ప భక్తులు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఆలయం దగ్గర భద్రతను పెంచి, కర్ఫ్యూ విధించారు. ఐతే 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం కేరళ వెళ్లిన సామాజిక వేత్త తృప్తీ దేశాయ్‌ని ఆందోళనకారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. 14 గంటలు విమానాశ్రయంలోనే ఉన్న ఆమె, చేసేది లేక తిరిగి ముంబయి వెళ్లిపోయారు. ఆమెను అడ్డుకున్న దాదాపు 500 మంది ఆందోళనకారుల్ని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐతే శనివారం ముంబై చేరిన తృప్తికి అక్కడ కూడా నిరసన సెగ ఎదురైంది. ఆందోళనకారుల కారణంగా తృప్తి, ఆమెతో ఉన్న ఐదుగురు మహిళలు ముంబై ఎయిర్‌పోర్ట్ బయటకు రాలేకపోయారు. చివరకు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు, ముంబై పోలీసుల భద్రత మధ్య అక్కడి నుంచి వెళ్లగలిగారు.

  ప్రతీకాత్మక చిత్రం

  మరో వివాదానికి తెరతీసిన తస్లీమా నస్రీన్

  తుప్రీ దేశాయ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. శబరిమల ప్రవేశానికి మహిళా కార్యకర్తలకు ఎందుకంత ఆత్రుతో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు... గృహ హింస, అత్యాచారాలు, లైంగిక దాడులు, విద్వేషం వంటి వాటి వల్ల బాధపడుతున్న గ్రామాలకు వెళ్తే బాగుంటుంది. బాలికలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ, సమాన వేతనాలు పొందడానికి అవకాశాలు లేని గ్రామాలకు వెళ్తే బాగుంటుంది" అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తూ కామెంట్లు రాస్తున్నారు.


  మరోవైపు మహిళలందర్నీ అనుమతించాలన్న తీర్పుపై ట్రావన్ కోర్ దేవస్థానం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సెప్టెంబరు 28న ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరబోతోంది.

  Published by:Praveen Kumar Vadla
  First published:

  Tags: Kerala, Sabarimala Temple, Supreme Court

  ఉత్తమ కథలు