• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KERALA ASSEMBLY ELECTIONS BJP MAKES U TURN ON SREEDHARANS CM CANDIDATURE IN KERALA SK

Kerala: కేరళ సీఎం అభ్యర్థిపై కన్‌ఫ్యూజన్.. బీజేపీ యూటర్న్.. శ్రీధరన్ కాదా..?

Kerala: కేరళ సీఎం అభ్యర్థిపై కన్‌ఫ్యూజన్.. బీజేపీ యూటర్న్.. శ్రీధరన్ కాదా..?

ఈ.శ్రీధరన్

బీజేపీ యూటర్న్ తీసుకుంది. కేరళలో బీజేపీ సీఎం అభ్యర్ధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకమాండ్ స్పష్టం చేసింది.

  • Share this:
    అసెంబ్లీ ఎన్నికల కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ చేరడం.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన్ను నిన్న సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయాయి. ఐతే అంతలోనే బీజేపీ యూటర్న్ తీసుకుంది. కేరళలో బీజేపీ సీఎం అభ్యర్ధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకమాండ్ స్పష్టం చేసింది. గురువారం కేరళ బీజేపీ చీఫ్ కే. సురేంద్రన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు శ్రీధరన్ నేతృత్వంలో కేరళ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత వి. మురళీధరన్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడానని.. సీఎం అభ్యర్ధిపై ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన చెప్పారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై కన్‌ఫ్యూజన్ నెలకొంది.

    మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందిన శ్రీధరన్ ఫిబ్రవరిలో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని వెల్లడించారు. ‘ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేరళను అప్పుల ఊబి నుంచి బయట పడేయాలి. అలాగే, అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి.’ అని శ్రీధరన్ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ముఖ్యమంత్రే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? గవర్నర్ అవ్వొచ్చు కదా అని ప్రశ్నించగా, గవర్నర్ గిరీ కంటే తాను ముఖ్యమంత్రిగానే ఎక్కువ సేవ రాష్ట్రానికి చేయగలనన్నారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్‌కు పెద్దగా అధికారాలు ఉండవని కుండబద్దలు కొట్టారు.


    కాగా, 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. ఐతే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు బ్రిజేష్ పాఠక్, రీటా బహుగుణ జోషి, అశుతోష్ టాండన్ కూడా పాల్గొన్నారు. ఐతే ఆ మెట్రో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్ మాత్రం పక్కనబెట్టారేశారని విమర్శలు వచ్చాయి. ప్రారంభోత్సవంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడులైన విషయం తెలిసిందే. కేరళతో పాటు తమిళనాడు, పుదచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాల ఫలితాలతో పాటు కేరళ ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు