Home /News /politics /

KERALA ASSEMBLY ELECTION RESULTS 2021 LDF CREATES HISTORY BY RETAINING POWER SECOND TIME SK

Kerala: కేరళలో చరిత్ర సృష్టించిన పినరయి విజయన్.. రెండోసారి అధికారం

కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ సీఎం పినరయి విజయన్

కేరళలో గత 40 ఏళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార మారుతుంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే.. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మరోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకుంది.

    కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది.  కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లున్నాయి. సాయంత్రం 05 గంటల వరకు ఎల్డీఎఫ్ 86 స్థానాల్లో గెలిచింది. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక యూడీఎఫ్ 36 సీట్లు సాధించింది. మరో 5 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. మిగిలిన ఏ పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. సీఎం పినరయి విజయన్ ధర్మదాం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలువలేదు.

    పాలక్కడ్ నియోజకవర్గం నుంచి మెట్రోమ్యాన్ శ్రీధర్ ప్రారంభంలో లీడింగ్‌లో ఉన్నప్పటికీ చివరకు ఓడిపోయారు.  ఆయనపై కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ 3,840 ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. ఇక బీజేపీ తరపున త్రిస్సూరు నుంచి పోటీచేసిన సినీ నటుడు సురేష్ గోపి కూడా పరాజయం పాలయ్యారు. అంతేకాదు కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ మంజేశ్వర్‌లో ఓడిపోయారు.

    కేరళలో గెలుపుతో సీఎం విజయన్ రికార్డు సృష్టించారు. కేరళలో గత 40 ఏళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార మారుతుంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే.. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మరోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకుంది. కరోనాపై కేరళ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందన్న పేరుంది. సంక్షోభ సమయంలో సీఎం పినరయి విజయన్ చక్కగా పనిచేసి.. కరోనా కట్టడిలో విజయం సాధించారని అంతర్జాతీయ కథనాలు కూడా వచ్చాయి. కోవిడ్‌పై చేసిన పోరాటమే ఎన్నికల్లో కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    మరోవైపు ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ బొక్కబోర్లా పడింది. మెట్రోమ్యాన్‌ను పార్టీలో చేర్చుకొని.. సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది. కానీ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. ఒక్క చోట కూడా గెలవలేదు. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. 73.58శాతం పోలింగ్ నమోదయింది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Kerala, Kerala Assembly Elections 2021, Pinarayi Vijayan

    తదుపరి వార్తలు