మమత ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా... దీదీకి మోదీ కౌంటర్

మరోవైపు తుఫాను ప్రభావం మోదీ ఇంతవరకు మమతతో మాట్లాడలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

news18-telugu
Updated: May 6, 2019, 2:42 PM IST
మమత ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా... దీదీకి మోదీ కౌంటర్
ప్రధాని మోదీ, మమత బెనర్జీ
news18-telugu
Updated: May 6, 2019, 2:42 PM IST
ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై విమర్శలు కురిపించారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌లో పర్యటించిన ప్రధాని... దీదీపై తనదైన స్టైల్లో ఆరోపణలు చేశారు. ఫొని తుఫాను విషయంలో కూడా స్పీడ్ బ్రేకర్ దీదీ రాజకీయాలు చేసిందన్నారు మోదీ. మమతతో మట్లాడేందుకు ఫోన్ చేస్తే... తన కాల్‌ను నిరాకరించిందన్నారు. ఆమెకు ఎంత అహంకారం అంటూ విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా దీదీ నిరాకరించిందన్నారు. బెంగాల్ తమలూక్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బెంగాల్ సీఎం మమతపై ఆరోపణలు చేశారు. దీంతో బెంగాల్ గవర్నర్‌ కేసరినాథ్ త్రిపాఠీతో ఫోన్ చేసి తుఫానుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఫొని తుఫాను సృష్టిస్తున్న బీభత్సంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఫోనులో మాట్లాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు ప్రయత్నించారని, అయినప్పటికీ ఆయనతో ఆమె మాట్లాడడం కుదరలేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నరు కేసరినాథ్‌ త్రిపాఠీతో మోదీ మాట్లాడారని చెప్పారు.

‘మమతా బెనర్జీతో మోదీ మాట్లాడడానికి ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది.. ఆమెకు రెండు సార్లు ఫోన్ చేశారు. మొదటిసారి కాల్ చేస్తే... సీఎం మమత పర్యటనలో ఉన్నారని తెలిపారు. రెండోసారి ఫోన్ చేయగా... తాము తిరిగి ఫోన్‌ చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పారని ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు వివరించారు.
మరోవైపు తుఫాను ప్రభావం మోదీ ఇంతవరకు మమతతో మాట్లాడలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గవర్నర్‌కు మాత్రమే ఫోన్ చేసి తుఫాను పరిస్థితిపై మోదీ ఆరాతీశారని విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మరోవైపు, తాను పశ్చిమ బెంగాల్‌ గవర్నరుతో మాట్లాడిన విషయాన్ని మోదీ ఇప్పటికే తన ట్విటర్‌ ఖాతా ద్వారా వివరించారు.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...