Home /News /politics /

KEJRIWAL LED AAP RISING IN PUNJAB AND NATIONAL POLITICS HOW THEY DID IT AND WHAT NEXT FOR PARTY DESPITE KCR MAMATA STRATEGIES MKS

సైలెంట్ కిల్లర్ Kejriwal: ఏ ప్రాంతీయ పార్టీకీ సాధ్యంకానిది.. KCR హడావుడి, Mamata గర్జనకు భిన్నంగా..

కేజ్రీవాల్

కేజ్రీవాల్

దేశంలో ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేని విజయాన్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సాధించింది. పంజాబ్ లో విజయంతో తన స్టేచర్ ను ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీ స్థాయికి మార్చుకుంది..

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, అనూహ్య రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పై బీజేపీ రెండోసారి కూడా పట్టునిలుపుకొని ప్రస్తుతం 270 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, సమాజ్ వాదీ పార్టీ కేవలం 133 స్థానాల్లో కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ 3, బీఎస్పీ 2 సీట్లలోనే సత్తాచాటుతున్నాయి. ఇక పంజాబ్ లో మాత్రం అధికార కాంగ్రెస్ ను చావుదెబ్బ కొడుతూ, హస్తం గుర్తుపై పోటీచేసిన హేమాహేమీలను ఓడిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 90కిపైగా స్థానాల్లో జయకేతనం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యంకాని అసాధారణ విజయాన్ని ఆప్ సొంతం చేసుకుంది..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన బలాన్ని పదిలపర్చుకోగా.. ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ మాత్రం సైలెంట్ కిల్లర్ గా అవతరించారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. పంజాబ్ లో అసాధారణ విజయం సాధించనుంది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకుగానూ ఆప్ ఏకంగా 91 స్థానాల్లో లీడ్ సాధించింది. తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి ఆప్ సెంచరీ(100) మార్కును దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. సాకేతికంగా ఆప్ ప్రాంతీయ పార్టీనే అయినా, ‘ఢిల్లీకే పరిమితమైన పార్టీ’గానూ ముద్రపడినా.. పంజాబ్ లో గెలుపు ద్వారా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి సవాలు విసరగలిగే స్థాయిని పొందిందనడం అతిశయోక్తి కాదు.

Punjab Results 2022: తాగుబోతని తిట్టిపోశారు.. ఇప్పుడాయనే సీఎం అయ్యారు!.. Bhagwant Mann


బెంగాల్ లో వరుసగా రెండోసారి విజయం సాధించి, బీజేపీని నిలువరించిన మమతా బెనర్జీ తన టీఎంసీ పార్టీని జాతీయ పార్టీగా మలచేందుకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అవకాశంగా వాడుకున్నారు. కానీ దీదీ ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. ఇక కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, మాయవతి బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, నవీన్ పట్నాయక్ బీజేడీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, ఎంకే స్టాలిన్ డీఎంకే, దేవేగౌడ జేడీఎస్ లాంటి హేమాహేమీ పార్టీలు ఇప్పటిదాకా చేయలేని పనిని కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ చేసి చూపింది. మన దేశంలో ప్రాంతీయ పార్టీ స్టేచర్ కలిగిన ఏ రాజకీయ పార్టీ కూడా వేరే రాష్ట్రంలో(అది పొరుగున ఉన్నా, దూరం ఉన్నా) విజయాన్ని సాధించింది లేదు.

Telangana: ఉద్యోగాల ప్రకటన బీజేపీ విజయం.. కమలం పొగతో KCR ఉక్కిరిబిక్కిరి: Bandi Sanjay


ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ఇప్పుడు పంజాబ్ నూ ఊడ్చిపారేయడం ద్వారా తన స్టేచర్ ను ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీ స్థాయికి మార్చుకుంది. ఇదే పనిని మమత కూడా ప్రయత్నించినా ఫలితం రాలేదు. బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించడంలో కేజ్రీవాల్ ఏనాడూ వెనుకడుగు వేయలేదు. యూపీలో అఖిలేశ్ ఎస్పీతోనూ కేజ్రీవాల్ జట్టుకట్టాడు. కానీ కేవలం బీజేపీని నిలువరించాలనే లక్ష్యంతో మమత, కేసీఆర్ లాంటి నేతలు చేస్తోన్న ప్రయత్నాలకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు కేజ్రీవాల్. అదే సమయంలో ప్రత్యర్థులను ఓడించాలనే తపన కంటే, సొంత పార్టీని ఎలా గెలిపించుకోవాలా?అనే వ్యూహంతో కేజ్రీవాల్ అనుసరించిన ఎత్తుగడలు సక్సెస్ అయినట్లు తాజా ఫలితాలతో వెల్లడైంది.

KCR అంటే అర్థాలే వేరు : నోటిఫికేషన్లతోపాటు నిరుద్యోగులకు మరో బంపర్ ఆఫర్: Jeevan Reddy


నిజానికి కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని 2020లోనే మొదలుపెట్టారు. ఆప్ ప్రచురించిన కరపత్రాల దగ్గర్నుంచి ప్రచార ఫ్లెక్సీలు, మేనిఫెస్టో రూపకల్పన, ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన దాకా లోతైన అధ్యయనం, పక్కా ప్రణాళికతో చేశారు క్రేజీవాల్. పంజాబ్ ఎన్నికలకు ఆప్ ఇంచార్జిలైన ఢిల్లీ ఎమ్మెల్యులు జర్నైల్ సింగ్, రాఘవ్ చడ్డాల నుంచి అనుకున్న ఫలితాలను రాబట్టుకోగలిగారు. ఢిల్లీ మోడల్ ను ఊదాహరణగా చూపుతూ పంజాబ్ లో ఒక్క అవకాశం ఇవ్వాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను పంజాబీలూ మన్నించారు.

Telangana ముందస్తు ఎన్నికలు! CM KCR హ్యాట్రిక్ కొట్టినట్టే.. ఉద్యోగాల ప్రకటన తర్వాత Owaisi వ్యాఖ్యలు


‘‘2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా 2022 అసెంబ్లీ ఎన్నికలను భావిస్తోన్న క్రమంలో ఆప్ ఎదుగుదల.. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటముల ఏర్పాటును ప్రాభవితం చేయబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ప్రస్తుతానికి వెల్లడైన ఫలితాలతో పోలిస్తే 2024లో సీన్ భిన్నంగా ఉంటుందని అనుకోలేం. జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన సవాలుగా ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే, ఇతర పార్టీలు కాంగ్రెస్‌తో లేదంటే కాంగ్రెసేతర బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయొచ్చు. వారు జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో కనిపిస్తారు, కానీ అది అంత సులువైన లేదా త్వరగా జరిగే విషయం కాబోదు.

Land Monetisation: ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మకం ఇంకా వేగంగా -NLMCకి కేంద్ర కేబినెట్ ఆమోదం


కేజ్రీవాల్ చాలా తెలివిగల ఆటగాడు అని, ఢిల్లీ తర్వాత పంజాబ్ లో గెలిచినంత మాత్రాన బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమికి నాయకత్వ స్థానాన్ని ఆయన కోరుకోడని, అయితే, కేసీఆర్ మాదిరిగా ప్రాంతీయ స్థాయిలోనే ఉంటూ బీజేపీపై పోరేకంటే, తన పరిధిని విస్తరించుకుంటూ ఫలితాలతోనే సవాళ్లు విసరాలనే వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నట్లు సీఎస్డీఎస్ నిపుణుడు సంజయ్ కుమార్ వ్యాఖ్యానిస్తారు. వ్యవహారంలో కేసీఆర్, మమతలకు భిన్నంగా బీజేపీపై తక్కువ విమర్శలుచేస్తూ, తన పరిధిని విస్తరించుకోవడం, తద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఆప్ ను నిలబెట్టడం కేజ్రీవాల్ సైలెంట్ గా చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: AAP, Arvind Kejriwal, Assembly Election 2022, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు