news18-telugu
Updated: April 24, 2019, 3:52 PM IST
కేరళ సీఎం పినరయి విజయన్
కేరళ సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. నిన్న (ఏప్రిల్ 23) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. దానిపై కేరళ సీఎం పినరయి విజయన్ను మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అంతే ఆయన సీరియస్ అయిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతంపై మీ స్పందనేంటి అని అడిగిన ఓ జర్నలిస్టుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’దూరంగా ఉండు’ అంటూ ర్యాష్‌గా సమాధానం ఇచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి సీఎం బయటకు వెళ్తుండగా ఆయనను ప్రశ్నించిన మీడియాకు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. దీంతో ఇప్పుడు సీఎం దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. పెరిగిన పోలింగ్ శాతంపై ప్రశ్నిస్తే... సీఎంకు అంత అసహనమెందుకు అంటూ కేరళ ప్రజలు, ఓటర్లు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఎక్కడైన పోలింగ్ శాతం పెరిగిందంటే... అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు లెక్కలేస్తారు విశ్లేషకులు. ఇప్పుడు కేరళలో ఓటింగ్ శాతం పెరగడంతో అది ఎక్కడ బీజేపీకి ప్లస్ అవుతుందేమోనన్న ఆందోళనలో పడిపోయారు కేరళ సీఎం విజయన్. అందుకే మీడియా పెరిగిన పోలింగ్ శాతంపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా అసహనం వ్యక్తంచేశారని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.
గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి కేరళలో ఓటింగ్ శాతం నమోదయ్యింది. అత్యధికంగా ఈసారి 77.68 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. నిన్న (ఏప్రిల్ 24) కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(LDF) అధికారంలో ఉండగా...UDF యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు గట్టిగా పోరాడుతున్నాయి. కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు.
First published:
April 24, 2019, 3:37 PM IST