ఎన్నికలు.. ఫలితాలు.. రాజకీయ చర్చలు.. ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు.. విసుర్లు.. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 100 రోజుల పాటు బిజీ బిజీగా గడిపారు. లోక్‌సభ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసిన అనంతరం సేద తీరేందుకు కేదార్‌నాథ్ వెళ్లిన ఆయన అక్కడ ఓ గుహలో 12 గంటల పాటు ధ్యానం చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ కాదిది.. ప్రధాని మోదీ ఆలోచన నుంచి పుట్టిందిదీ. గతంలో కేదారేశ్వరుడిని దర్శించుకున్న సందర్భంగా.. ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఏర్పాటు బాగుంటుందని అక్కడి నిర్వాహకులకు సలహా ఇచ్చారట. దాంతో ఆయన కోరిక మేరకు గుహను ఏర్పాటు చేశారు. అయితే.. ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కలుగుతోంది.
ఈ గుహ పేరు ‘రుద్ర గుహ’. గత ఏడాదే ఈ గుహను నిర్మించారు. 12,250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిలో భక్తులు ధ్యానంతో పాటు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్‌కు చెందిన టూరిజం ప్రాపర్టీ. ఈ గుహలో ధ్యానం చేసుకొనేందుకు ఒక్కరికి రోజుకు రూ.3వేలు వసూలు చేసేవారు. అయితే, పర్యాటకులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో రూ.990కి తగ్గించారు.
ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, విద్యుత్, టెలిఫోన్ తదితర అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు. అంతేనా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రెండు సార్లు టీ కూడా అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elections 2019, Kedarnath, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi