Home /News /politics /

KCR TRYING TO TAKE AWAY MACHILIPATNAM PORT TO GIVE JOBS FOR TELANGANITES IN THAT ALLEGED BY NARA LOKESH MS

బందరు పోర్టుపై కేసీఆర్ అందుకే కుట్ర పన్నుతున్నారు : నారా లోకేశ్

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

Nara Lokesh Latest Comments : హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్న టీడీపీ అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే భూములు లాక్కుంటామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.

    ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. బందరు పోర్టును స్వాధీనం చేసుకుని.. అందులో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఏపీలో బలహీన ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యపడుతుందని.. అందుకే జగన్‌కు కేసీఆర్ సహకరిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమైందని జగన్ అంటున్నారని.. మనం ఎలా ఊరుకుంటామని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా హరిపురంలో నిర్వహించిన రోడ్ షోలో లోకేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

    హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్న టీడీపీ అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే భూములు లాక్కుంటామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైతే పోలవరం ప్రాజెక్టును ఆపేయడంతో పాటు, ముంపు మండలాలను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులకు పసుపు-కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిద్దామా? లేక పసుపు-కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిద్దామా? అని ప్రజల్నిప్రశ్నించారు. సంక్షేమాన్ని అభివృద్దిని జోడెద్దుల బండిలా నడిపిస్తున్న టీడీపీకే ప్రజలు పట్టం కట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, CM KCR, KTR, Lok Sabha Election 2019, Nara Lokesh, Telangana, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు