నేడు కేరళకు కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం..

KCR Federal Front : కేరళ పర్యటన అనంతరం ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించవచ్చునని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడుతారని సమాచారం.

news18-telugu
Updated: May 6, 2019, 8:03 AM IST
నేడు కేరళకు కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం..
కేసీఆర్, తెలంగాణ సీఎం(File)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కేరళ వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఆయన భేటీ కానున్నారు. త్రివేండ్రంలో రేపు సాయంత్రం 6గంటలకు భేటీ అయ్యే వీరిద్దరు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. నాలుగు విడతల లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ టూర్స్ చేపట్టనున్నారు. తాజా కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కుటుంబంతో కలిసి కేసీఆర్ దర్శించుకోనున్నారు.

కేరళ పర్యటన అనంతరం ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించవచ్చునని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడుతారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్.. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఆయన భేటీ అయి చర్చించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ టూర్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>