Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఉత్తమ్ డిమాండ్

    పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ పనులను ఏపీ మొదలుపెడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    news18-telugu
    Updated: May 13, 2020, 3:36 PM IST
    సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఉత్తమ్ డిమాండ్
    ఉత్తమ్ కుమార్, కేసీఆర్
    • Share this:
    ఏపీ, తెలంగాణ జలజగడం రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమవుతోందంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా బుధవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ పనులను ఏపీ మొదలుపెడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    పోతిరెడ్డిపాటు విస్తరణ తెలంగాణ రైతాంగానికి గొడ్డలిపెట్టు. తెలంగాణకు ఇంత పెద్ద నష్టం జరుగుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఇది సీఎం నిర్లక్ష్యమా? అసమర్థతా? నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతుందనే ఏపీ విభజించబడింది. ఆనాడు నీటి దొంగతనం జరుగుతుందని అరిచిన వాళ్లు.. ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ మాట్లాడడం లేదు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.
    ఉత్తమ్ కుమార్ రెడ్డి


    కాగా, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోకుండా కృష్ణా జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని అందులో ఉందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సంఘమేశ్వర పాయింట్ నుంచి 3 టీఎంసీలు,పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో ఉందని తెలిపారు. మొత్తంగా 8 టీఎంసీలకు ప్రపోజల్ పెట్టారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పోతిరెడ్డి పాడు వ్యహహారం ఇరు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కింది.
    Published by: Shiva Kumar Addula
    First published: May 13, 2020, 3:28 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading