TSRTC Strike : తగ్గేది లేదు.. కేసీఆర్ బేషరతుగా చర్చలకు పిలవాల్సిందే : అశ్వత్థామరెడ్డి

TSRTC Strike : తాము సమ్మె నోటీసులో పేర్కొన్న విధంగా 26 డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని.. ఏ ఒక్కదాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 10:11 AM IST
TSRTC Strike : తగ్గేది లేదు.. కేసీఆర్ బేషరతుగా చర్చలకు పిలవాల్సిందే : అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
news18-telugu
Updated: October 23, 2019, 10:11 AM IST
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీకి సంబంధించిన 21 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ వర్గాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. తాము సమ్మె నోటీసులో పేర్కొన్న విధంగా 26 డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని.. ఏ ఒక్కదాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం బేషరతుగా
చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. చర్చల ద్వారానే సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లు న్యాయబద్దమైనవని.. వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

కాగా, ఆర్టీసీ 21 డిమాండ్ల పరిష్కారానికి కమిటీ వేసిన ప్రభుత్వం.. చర్చల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించిన ప్రభుత్వం.. హైకోర్టుకు ఆ నివేదికను సమర్పించనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికీ చర్చల ప్రస్తావన లేకపోవడంతో.. దీనికి ముగింపు ఏంటన్నది అంతుపట్టడం లేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తీవ్ర విముఖతతో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడే ఆర్టీసీని మూసివేసిన సంగతి మరిచిపోయారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్‌పరం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలను ఇచ్చిందని బీజేపీకి గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం నియమించిన ఈడీల కమిటీ బుధవారం సమావేశం కానుంది. సాయంత్రం లోగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...