ఆర్టీసీతో చర్చలు లేనట్టేనా...? హైకోర్టు చెప్పినా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా..?

అధికారులు ప్రగతి భవన్‌కు రావాలని కబురు వెళ్లిన సమయంలో కేసీఆర్ తాజ్‌కృష్ణ హోటల్లో మెదక్ ఎస్పీ చందన దీప్తి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ప్రగతి భవన్‌కు చేరుకోగానే.. అధికారులతో ఏమీ మాట్లాడకుండానే ఆయన నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయారు.

news18-telugu
Updated: October 19, 2019, 7:59 AM IST
ఆర్టీసీతో చర్చలు లేనట్టేనా...? హైకోర్టు చెప్పినా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా..?
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని తెలంగాణ హైకోర్టు సీఎం కేసీఆర్‌కు శనివారం 10.30గంటల వరకు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పును కూడా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే.. ఈపాటికే కార్మిక సంఘాల నేతలకు ఆ సంకేతాలు వెళ్లి ఉండాల్సిందని.. కానీ ఇప్పటికీ అలాంటిదేమీ లేదన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రగతి భవన్ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులకు కబురు వెళ్లింది. రాత్రి 8గంటలకు సమీక్ష ఉంటుందని వారికి తెలియజేశారు. దాంతో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ,కమిషనర్ సందీప్ కుమార్ సుల్దానియా,పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు.అయితే హైకోర్టు వ్యాఖ్యలు కేవలం సూచనలు మాత్రమేనని.. దానిపై సమీక్ష అక్కర్లేదని రాత్రి 9గంటల సమయంలో సీఎం కార్యాలయ వర్గాలు వారిని వెనక్కి పంపించేశాయి. దీంతో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని ఆశించినవారంతా ఢీలా పడిపోయారు.

అధికారులు ప్రగతి భవన్‌కు రావాలని కబురు వెళ్లిన సమయంలో కేసీఆర్ తాజ్‌కృష్ణ హోటల్లో మెదక్ ఎస్పీ చందన దీప్తి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ప్రగతి భవన్‌కు చేరుకోగానే.. అధికారులతో ఏమీ మాట్లాడకుండానే ఆయన నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయారు. సమీక్ష సమావేశం అవసరం లేదని.. అధికారులను పంపించివేయాలని చెప్పారు. దీంతో అప్పటిదాకా సీఎం కోసం వేచి చూసిన అధికారులు తిరుగుపయనం కాక తప్పలేదు. అయితే ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనలు చేయడం తప్పితే.. నేరుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే కేసీఆర్ పెద్దగా పట్టించుకోవట్లేదన్న ప్రచారం జరుగుతోంది. తదుపరి విచారణను కోర్టు 10 రోజుల పాటు వాయిదా వేయడంతో.. మరో 10 రోజుల పాటు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఏం కాదన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే,శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని టీఎస్ఆర్టీసీ, ప్రతిపక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.శనివారం కేసీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే ఆదివారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు.'
First published: October 19, 2019, 7:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading