KCR MEETS UDDHAV THACKERAY SHARAD PAWAR IN MUMBAI WHILE BJP ASKS HAS MAHA CM SOUGHT SONIA GANDHI PERMISSION MKS
CM KCR-Thackeray Meet: సోనియా గాంధీ అనుమతితోనే కేసీఆర్-ఉద్దవ్ ఠాక్రే భేటీ? అనూహ్య కోణం!
కేసీఆర్ ఠాక్రే భేటీ
కాంగ్రెస్ మద్దతుతో సీఎంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న తెలంగానకు సీఎం అయిన కేసీఆర్ తో భేటీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమతితోనే వీరి సమావేశం జరిగిందా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దెదించేదాకా శాంతించబోనని, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తన యుద్ధానికి రాజకీయ మద్దతు కోసం నేడు కీలక రాజకీయ పర్యటన చేపట్టారు. టీసీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాడు ముంబైలో పర్యటించారు. తొలుత మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను, ఆ తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇద్దరు మరాఠా నేతలు కూడా కేసీఆర్ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అగీకారం తెలిపారు. కలిసి పోరాడుతామంటూ విడివిడిగా సంయుక్త ప్రెస్ మీట్లలో స్పష్టం చేశారు. అయితే కేసీఆర్-ఠాక్రే భేటీపై బీజేపీ అనూహ్యరీతిలో స్పందించింది..
మహారాష్ట్రలో ప్రసస్తుతం మహా వికాస్ అగాధి ప్రభుత్వం కొనసాగుతుండటం, ఆ కూటమిలో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతుతో సీఎంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న తెలంగానకు సీఎం అయిన కేసీఆర్ తో భేటీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ వెలిబుచ్చిన అనుమానాన్నే తెలంగాణ నెటిజన్లు పలువురు సైతం ప్రస్తావించడం గమనార్హం. కేసీఆర్ ముంబై టూర్ వల్ల ఠాక్రే సర్కారు ఇబ్బందుల్లో పడుతుందా? తరహా కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక విషయానికొస్తే..
మహా సీఎం ఠాక్రే, తెలంగాన సీఎం కేసీఆర్ భేటీపై మహారాష్ట్ర బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా శివసేన్, టీఆర్ఎస్ అధినేతలు భేటీ కావడంపై మహారాష్ట్ర బీజేపీ నేత కిరీట్ సోమయ కీలక వ్యాఖ్యలు చేశఆరు. మహా వికాస్ అగాధి ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో కొనసాగుతున్న నేపథ్యాన్ని గుర్తుచేస్తూ.. ‘సోనియా గాంధీ అనుమతితోనే ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ తో రాజకీయ భేటీలో పాల్గొన్నారా?’అని కిరీట్ ఎద్దేవా చేశారు. అంతేకాదు,
‘ముంబైలో కేసీఆర్ ఠాక్రేని కలిశారు. గతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ముంబై వచ్చి మహా సీఎంను కలిశాను. కేసీఆర్, మమత ప్రయత్నమంతా బీజేపీయేతర, కాంగ్రెసేతర జాతీయ కూటమి కోసమే అని తెలిసిందే. మరి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతోన్న ఠాక్రే.. తొలుత మమతకు మద్దతు ఇస్తానని చెప్పారు. కానీ రోజుల వ్యవధిలోనే శివసేనతో టీఎంసీకి ఎలాంటి పొత్తు ఉండదని విరుద్ధ ప్రకటన చేశారు. మరి కేసీఆర్ తో భేటీకి ఉద్ధవ్ సోనియా అనుమతి తీసుకున్నారో లేదో?’అని బీజేపీ నేత కిరీట్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నిలువునా చీల్చేసి, పెద్ద సంఖ్యలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజేపీ.. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా ముద్దాడుతోందని కేసీఆర్ విమర్శించిన తర్వాత.. మరి తెలంగాణలోనూ టీఆర్ఎస్ చేసింది అదే కదా అని ఎదురు ప్రశ్నలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఖండించిన కేసీఆర్.. అంత మాత్రాన తాను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్లు కాదని స్పష్టం చేశారు. మరి మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పొత్తుతో ప్రభుత్వాన్ని నడుపుతోన్న ఠాక్రేతో భేటీ కావడం రాజకీయవైచిత్రే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.