కేసీఆర్ మరోసారి ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇస్తారా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటాలో తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వొచ్చని... ఆయన కాకపోతే ఆ ఛాన్స్ ఖమ్మం ఎమ్మెల్యే అయిన పువ్వాడ అజయ్ కుమార్‌కు దక్కొచ్చని ప్రచారం సాగుతోంది.

news18-telugu
Updated: July 20, 2019, 12:42 PM IST
కేసీఆర్ మరోసారి ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇస్తారా ?
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడతారా అనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేబినెట్‌లో మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండటంతో... కేటీఆర్, హరీశ్ రావుకు ఈ సారి కేబినెట్‌లో చోటు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరి సంగతి ఇలా ఉంటే... ఖమ్మం నుంచి ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే... ఆయన కచ్చితంగా మంత్రి అయ్యేవారు. కానీ ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో...కేబినెట్ బెర్త్ దక్కలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ తుమ్మల నాగేశ్వరరావుకు మళ్లీ కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటాలో తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వొచ్చని... ఆయన కాకపోతే ఆ ఛాన్స్ ఖమ్మం ఎమ్మెల్యే అయిన పువ్వాడ అజయ్ కుమార్‌కు దక్కొచ్చని ప్రచారం సాగుతోంది. కేటీఆర్‌కు సన్నిహితుడైన పువ్వాడ అజయ్... కేబినెట్ బెర్త్ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు కచ్చితంగా ఆ వర్గానికి చెందిన నేతను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తుమ్మల లేదా పువ్వాడ అజయ్‌లలో ఎవరో ఒకరికి మంత్రిగా అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది.


First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>