Kalvakunta Himanshu: ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనవడు హిమాన్షు

సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన హిమాన్షు రావు.. కాలికి సాఫ్ట్ టిష్యూ డామేజ్ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను నడవగలుగుతున్నానని.. రేపటినుంచి పరుగెడతానని ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: October 1, 2020, 12:40 PM IST
Kalvakunta Himanshu: ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనవడు హిమాన్షు
మంత్రి కేటీఆర్‌తో హిమాన్షు
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయాలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఆయన కాలుకి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నొప్పి కారణంగా ఆయన నిలబడలేకపోతున్నాడని సోషల్ మీడియాలో కొందరు పేర్కొన్నారు. ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారని కొందరు చెబుతుంటే.. మరికొందరు గుర్రపు స్వారీ చేస్తుండగా పడిపోయాడని చెబుతున్నారు. ఐతే తన ఆరోగ్యంపై స్వయంగా స్పందించిన హిమాన్షు రావు.. ఈ వార్తలను కొట్టిపారేశారు. పుకార్లను నమ్మవద్దని సూచించారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన హిమాన్షు రావు.. కాలికి సాఫ్ట్ టిష్యూ డామేజ్ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను నడవగలుగుతున్నానని.. రేపటినుంచి పరుగెడతానని ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై పుకార్లు పుట్టించే సాహసాలు దయచేసి ఆపండని విజ్ఞప్తి చేశారు.


హిమాన్షు ఆరోగ్యంపై తాను స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో..పుకార్లకు పుల్‌స్టాప్ పడింది. కాగా, మనవడు హిమాన్షు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ..! ప్రభుత్వ కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాల్లో తాతతో పాటు కనిపిస్తారు. సీఎం కేసీఆర్ బయటకు వెళ్లినప్పుడు తన వెంట తీసుకెళ్తారు. ఇక హిమాన్షు కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక సాయం కోసం ఎవరైనా ట్విటర్‌లో రిక్వెస్ట్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. తన వల్ల అయ్యే సాయం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సమస్యలు పరిష్కరిస్తున్న హిమాన్షుపై తాతకు దగ్గ మనవడు, తండ్రికి దగ్గ కొడుకు అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading