యాదాద్రిలో కేసీఆర్ చిత్రాన్ని తొలగించిన శిల్పులు.. ఆ స్థానంలో..

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని అష్టభుజి ప్రాకార మంటప రాతిస్తంభాలపై వివాదాస్పద చిత్రాలను శిల్పులు పూర్తిగా తొలగించారు. సీఎం కార్యాలయం శనివారం జారీ చేసిన ఆదేశాలతో దైవిక సంబంధిత బొమ్మలు మినహా మిగతా అన్ని రకాల చెక్కడాలను చెరిపేసినట్లు వైటీడీఏ ప్రధాన స్థపతి ఆనందచారి వేలు తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 9, 2019, 9:34 AM IST
యాదాద్రిలో కేసీఆర్ చిత్రాన్ని తొలగించిన శిల్పులు.. ఆ స్థానంలో..
యాదాద్రి ఆలయంలోని రాతి కట్టడాలపై కేసీఆర్ చిత్రం తొలగింపు (ఫైల్)
  • Share this:
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని అష్టభుజి ప్రాకార మంటప రాతిస్తంభాలపై వివాదాస్పద చిత్రాలను శిల్పులు పూర్తిగా తొలగించారు. సీఎం కార్యాలయం శనివారం జారీ చేసిన ఆదేశాలతో దైవిక సంబంధిత బొమ్మలు మినహా మిగతా అన్ని రకాల చెక్కడాలను చెరిపేసినట్లు వైటీడీఏ ప్రధాన స్థపతి ఆనందచారి వేలు తెలిపారు. ఆలయ ప్రాకార మంటపంలో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మల చెక్కడంలో ఎవరి ప్రమేయం లేదని, ఒక శిల్పి తన సొంత నిర్ణయంతో చేశారని వెల్లడించారు. వివాదానికి దారి తీసిన చిత్రాలను తొలగించామని, పూర్తిగా దైవ సంబంధిత చిత్రాలను మాత్రమే చెక్కిస్తామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, తొలగించిన బొమ్మల స్థానంలో లతలు, పద్మాలు, హంసలతో పాటు దైవ సంబంధిత బొమ్మలను చెక్కడానికి మార్కింగ్‌లైన్లు వేశారు.

సీఎం కేసీఆర్‌ చిత్రం ఉన్న చోట సుదర్శన చక్రం, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు స్థానంలో హంసను చెక్కనున్నారు. కేసీఆర్‌ కిట్, తెలంగాణకు హరితహారం, తెలంగాణ మ్యాప్‌, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, మహాత్మా గాంధీ, చార్మినార్‌, పీర్ల బొమ్మలను తొలగించిన శిల్పులు.. వాటి స్థానంలో పద్మాలు, లతలు, హంసలతో పాటు ఇతర దైవిక సంబంధమైన ఆకృతుల స్కెచ్‌లు గీశారు. వీటి పనులను ప్రారంభిస్తామని స్థపతులు స్పష్టం చేశారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...