• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • KCR AND KTR IN OUT STATION THEN WHO IS ROLLING IN TELANGANA

ఔట్ ఆఫ్ స్టేషన్‌లో కేసీఆర్, కేటీఆర్.. ఎవరి చేతుల్లో తెలంగాణ పాలన?

ఔట్ ఆఫ్ స్టేషన్‌లో కేసీఆర్, కేటీఆర్.. ఎవరి చేతుల్లో తెలంగాణ పాలన?

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 15 రోజులైనా.. పాలన మాత్రం ట్రాక్ ఎక్కలేదు. కేసీఆర్, కేటీఆర్‌లిద్దరూ ఔటాఫ్ స్టేషన్. మరి పాలన ఎవరి చేతుల్లో ఉంది?

 • Share this:
  తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. ప్రమాణం చేశారు. కేసీఆర్‌తో పాటు ప్రమాణం చేసిన మహ్ముద్ అలీకి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికైనా, అధికారపార్టీకైనా కేసీఆర్, కేటీఆర్‌లే కీలకం. అలాంటివారు ఇప్పుడు అవుటాఫ్ స్టేషన్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశమై వివిధ రాష్ట్రాల పర్యటకు వెళ్లారు. మరోవైపు, కేటీఆర్.. యూరప్ పర్యటనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక 2,3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఆయన ఆ తర్వాత పత్తాలేరు. దీంతో, అటు ప్రభుత్వపాలన, ఇటు పార్టీ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందా? పాలన సాగుతోందా? అంటూ.. ఇప్పటికే విపక్షాలు తమ విమర్శలకు పదును పెంచుతున్నాయి.

  kcr, cm kcr, kcr speech, kcr live, kcr press meet, kcr third front, kcr meets mamata banerjee, kcr latest speech, kcr federal front, kcr press meet live, cm kcr live, kcr in vizag, kcr about jagan, kcr live speech, telangana cm kcr, kcr ap, kcr mamata banerjee, kcr federal front tour, kcr national politics, kcr in ap, kcr news, kcr about federal front, kcr movie, kcr songs, kcr jagan, kcr plans, cm kcr tour, kcr odisha, kcr delhi tour, cm kcr, kcr, trs, cm kcr delhi tour, cm kcr to visit delhi, trs leaders, trs leaders hopes on cm kcr delhi tour!, trs leaders discuss on cm kcr delhi tour, delhi, trs kcr, kcr tour of delhi, kcr tour to delhi, kcr to visit delhi, kcr speech, ck kcr goes to delhi, cm kcr targets delhi, trs chief kcr, highlights of cm kcr delhi tour, kcr third front, telangana cm kcr to visit delhi, కేసీఆర్, టీఆర్ఎస్, గోదావరి, పవన్, జగన్, మంథని, బాబు, వరంగల్, పుట్ట మధు, కాళేశ్వరం ప్రాజెక్టు, అక్బరుద్దీన్ ఓవైసి, ఫెడరల్ ఫ్రంట్, కెసిఆర్, కేసీఆర్, కే‌సీఆర్, రాజీనామాల ఆమోదం, కుట్ర మోడీ తాజా వ్యూహమిదే, ఫెడరల్ ఫ్రంట్ వెనక వ్యూహమేంటి, కేసీఅర్ ఫెడరల్ ఫ్రంట్ బిజేపి కుట్రే, సీఎం కేసీఆర్, కేసీఆర్ ఢిల్లీ టూర్,
  kcr naveen mamatha file


  తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో రెండోసారి అధికారం అప్పగిస్తే (కేసీఆర్, కేటీఆర్) తండ్రీకొడుకులిద్దరూ.. విహారయాత్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలు పెట్టేసింది. తాము అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్).. ఇప్పటికే రైతు రుణమాఫీపై నిర్ణయం తీసేసుకున్నామని, ఇక్కడ మాత్రం పాలన గాలికొదిలేశారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. మరో కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సైతం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. పాలన గాలికొదిలేసి టూర్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా, హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో జరిగిన గొడవపైనా ఆమె స్పందించారు. రోగి బంధువులు డాక్టర్లపైనా, అడ్డొచ్చిన పోలీసులపైనా దాడులు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇలాంటి ఘటనలు కేసీఆర్ పాలనలో మరెన్ని చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

  Telangana assembly elections2018|congress leader vijayashanti coments on kcr|అందుకే కేసీఆర్‌ను సోనియా గెంటేశారు: విజయశాంతి
  కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటో)


  కేసీఆర్, కేటీఆర్‌లిద్దరూ అవుట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండడంతో పాలన అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమైన సమీక్షలు, సమావేశాలన్నీ సీఎస్ ఎస్కే జోషి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ శాఖ అధికారులతోనూ ఆయనే సమీక్ష నిర్వహించారు. కొత్త ఫించన్ల అమలు కోసం లబ్దిదారుల ఎంపికపైనా అధికారులతో ఆయనే సమీక్ష నిర్వహించారు. 57 సంవత్సరాలు నిండినవారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డు ఆధారంగా, ఇప్పటికే 20 లక్షల మంది లబ్దిదారులను గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో లబ్దిదారులను గుర్తించి.. ఏప్రిల్ నుంచి కొత్త ఫించన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడి నెల గడవక ముందే.. ప్రతిపక్షాల నోటికి పనిదొరుకుతోందనే టాక్ రాజకీయవర్గాల్లో వినబడుతోంది.
  First published:

  అగ్ర కథనాలు