కవిత రాష్ట్రంలో మంత్రి కావొచ్చు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత మళ్లీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకు ఎదురుచూస్తారా లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేస్తారా అనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

  • Share this:
    ఇటీవల నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత భవిష్యత్తు ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత మళ్లీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకు ఎదురుచూస్తారా లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేస్తారా అనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. కవితను ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టవచ్చని బాజీరెడ్డి గోవర్ధన్‌ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలు మరింతగా కష్టపడి పనిచేసి ఉంటే ఆమె ఓటమిపాలయ్యేది కాదని బాజిరెడ్డి గోవర్ధన్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కవిత తిరిగి ఎమ్మెల్సీ అయి మంత్రిగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలైన కవితకు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ కంటే టీఆర్ఎస్‌కు 13 వేల పైచిలుకు ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఈ పరిస్థితికి కారణం ఏంటనే దానిపై ఆయన పోస్టుమార్టం మొదలుపెట్టారు.
    First published: