ఏపీ డీజీపీ రేస్‌లో కౌముది...జగన్ ఓకే చెబుతారా..?

గురువారం ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత డీజీపీ ఎంపికపై ఏపీ సీఎం హోదాలో ఆయన దృష్టిసారించే అవకాశముంది. సవాంగ్‌, కౌముదిలలో ఒకరికి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: May 29, 2019, 8:22 PM IST
ఏపీ డీజీపీ రేస్‌లో కౌముది...జగన్ ఓకే చెబుతారా..?
కౌముది, జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన తర్వాత...పాలనా వ్యవహారాలపై కీలకంగా చర్చ జరుగుతోంది. ఏపీ కొత్త పోలీస్‌బాస్ బాస్ ఎవరు? ప్రభుత్వ శాఖల సెక్రటరీలను మారుస్తారా? టీటీడీ బోర్డులో ప్రక్షాళన చేస్తారా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది హాట్‌టాపిక్‌గా మారింది. డీజీపీ ఆశావహుల జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు గౌతమ్‌ సవాంగ్‌, కౌముది పేర్లు ఉన్నాయి. అయితే డీజీపీ రేస్‌లో కౌముది ముందు వరసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కౌముది 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ వెస్ట్ జోన్ CRPF ఏడీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2007లో విశాఖ సీపీగా ఆయన పనిచేశారు. గురువారం ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత డీజీపీ ఎంపికపై ఏపీ సీఎం హోదాలో ఆయన దృష్టిసారించే అవకాశముంది. సవాంగ్‌, కౌముదిలలో ఒకరికి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>