KATHI KARTIKA LIKELY GOING TO JOIN A POLITICAL PARTY AND WANTED TO ACTIVE IN POLITICS AGAIN AND PLANS TO CLOSE WITH DUBBAKA PEOPLE PRV
Kathi Kartika: దుబ్బాక ప్రజా క్షేత్రంలోకి కత్తి కార్తీక..! త్వరలో పార్టీలో చేరే ఆలోచనలో బిగ్‌బాస్ తార ?
కత్తి కార్తీక(ఫైల్ ఫొటో)
చాలారోజులుగా కత్తి కార్తిక రాజకీయాల్లో యాక్టీవ్‌గా లేరు. అయితే మరోసారి ప్రజా క్షేత్రంలోకి రావాలని కత్తి కార్తిక చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏదైన రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కత్తి కార్తిక (Kathi Kartika) ప్రజా సమస్యలపై పోరాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గత దుబ్బాక (Dubbaka) ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. అయితే అప్పటి నుంచి కార్తిక రాజకీయాల్లో (Politics) యాక్టీవ్‌గా లేరు. అయితే మరోసారి ప్రజా క్షేత్రంలోకి రావాలని కత్తి కార్తిక చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏదైన రాజకీయ పార్టీ (Political party)లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్తికకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలు (Relationships) ఉండటంతో ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, టీఆర్ఎస్ నేత పద్మా రావు గౌడ్‌కు కూడా కార్తిక బంధువు (relative) కావడంతో టీఆర్ఎస్లో కూడా చేరే ఛాన్సు ఉంది. అయితే టీఆర్ఎస్ (TRS)లో ఇప్పటికే చాలామంది ఉండటం.. బీజేపీ టీఆర్ఎస్కు ధీటుగా ఎదుగుతుండటంతో కమలం తీర్థం పుచ్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచే..
కత్తి కార్తీక హైదరాబాదులోనే (Hyderabad) పుట్టింది పెరిగింది. పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ ఉన్నత విద్యను చదివిన కార్తీక, లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పూర్తి చేసి, లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది. కార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది, తరువాత వి6 ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది.
రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలతో..
తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మైక్ టీవిలో చేరి ముచ్చట విత్ కార్తీక అనే కార్యక్రమం చేసింది. 2017లో హైదరాబాదులోని బంజారా హిల్స్ లో బి స్టూడియోస్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక టివి ఛానల్ లో చేరి తనదైన శైలిలో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసింది. 2019లో టీమ్ టీవి పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది.
పద్మారావు గౌడ్ ఆదర్శమని..
కత్తి కార్తీక టీఆర్ఎస్ కీలక నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు చాలా దగ్గరి బంధువు. కార్తీక పద్మారావుకు వరుసకు మనవరాలు అవుతారు. తనకు తన తాత పద్మారావు గౌడ్ ఆదర్శమని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. గత రెండేళ్లుగా కత్తి కార్తీక తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.
దుబ్బాక ఓటర్ల షాక్..
అయితే ఆ ఎన్నికల్లో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కత్తి కార్తీక ప్రయత్నించారు. కానీ ఓటర్లు ఆమెకు డిపాజిట్ దక్కకుండా బిగ్ షాక్ ఇచ్చారు. ఆమెకు కనీసం 500 ఓట్లు కూడా పోల్ కాకపోవడం విశేషం. ఆ తర్వాత ఆమె గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరనున్నట్టుగా కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కార్తీక కలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్‌లో కూడా కత్తి కార్తీకకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా కార్తీకతో పార్టీలో చేరాల్సిందిగా సంప్రదింపులు జరిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.