Home /News /politics /

KATHI KARTHIKA LIKELY TO JOIN IN BJP NS

GHMC Elections: దుబ్బాకలో విఫలం.. రాజకీయ భవితవ్యంపై కత్తి కార్తీక కీలక నిర్ణయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కత్తి కార్తీక

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కత్తి కార్తీక

కత్తి కార్తీక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. మరో రెండు రోజుల్లో ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె కిషన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. దుబ్బాకలో ఓటమి అనంతరం సైలెంట్ గా ఉన్న ఆమె ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ బీజేపీలో చేరికల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. దుబ్బాకలో విజయం అనంతరం దూకుడుగా ఉన్న కమలనాథులు వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలు, అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్య నేతలకు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. తద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, నియోజకవర్గ ఇంచార్జి రవి కుమార్ యాదవ్ ను  ఇప్పటికే కాషాయ గూటికి చేర్చారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నివాసానికి నిన్న బీజేపీ కీలక నేతలు వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

    తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన కత్తి కార్తీక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. మరో రెండు రోజుల్లో ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె కిషన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. కత్తి కార్తీక టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు చాలా దగ్గరి బంధువు. కార్తీక పద్మారావుకు వరుసకు మనవరాలు అవుతారు. తనకు తన తాత పద్మారావు గౌడ్ ఆదర్శమని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    అయితే ఆమె టీఆర్ఎస్ లో చేరకుండా బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది. ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదగాలని భావించే ఆమె బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీ చేశారు. బహుజన ఆడబిడ్డగా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే ఆ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీకి మధ్య బిగ్ ఫైట్ గా మారడంతో కత్తి కార్తీగా ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. ఆ ఎన్నికల్లో ఆమె డిపాజిట్ కోల్పోయారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bandi sanjay, Bigg Boss, Hyderabad - GHMC Elections 2020, Kishan Reddy, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు