Home /News /politics /

KATHI KARTHIKA LIKELY TO JOIN CONGRESS PARTY SHE MEETS MADHU YASHKI GOUD SU

Kathi Karthika: త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక..? ఆ కీలక నేతతో భేటీ..

కత్తి కార్తీక(ఫైల్ ఫొటో)

కత్తి కార్తీక(ఫైల్ ఫొటో)

బిగ్‌బాస్ ఫేమ్‌, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేతతో ఆమె భేటీ కావడంతో.. ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి.

    బిగ్‌బాస్ ఫేమ్‌, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌తో కత్తి కార్తీక భేటీ అయినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్..ఆమెను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక, త్వరలోనే ముహుర్తం ఖరారు చేసుకుని కత్తి కార్తీక కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

    ఇక,  కత్తి కార్తీక టీఆర్ఎస్ కీలక నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు చాలా దగ్గరి బంధువు. కార్తీక పద్మారావుకు వరుసకు మనవరాలు అవుతారు. తనకు తన తాత పద్మారావు గౌడ్ ఆదర్శమని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. గత రెండేళ్లుగా కత్తి కార్తీక తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత ఫార్వ‌ర్డ్ బ్లాక్ త‌ర‌ఫున అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కత్తి కార్తీక ప్రయత్నించారు. కానీ ఓటర్లు ఆమెకు డిపాజిట్ దక్కకుండా బిగ్‌ షాక్ ఇచ్చారు. ఆమెకు కనీసం 500 ఓట్లు కూడా పోల్ కాకపోవడం విశేషం. ఆ తర్వాత ఆమె గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీలో  చేరనున్నట్టుగా కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కార్తీక కలిసింది.

    ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపుతున్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం సాగిస్తూ ముందుకు కదులుతున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలలో ఉన్న కొందరు నేతలను సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్‌ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కత్తి కార్తీకను కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు కత్తి కార్తీక కూడా సుముఖంగా ఉండటంతో.. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Revanth reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు