Home /News /politics /

KASU MAHESH REDDY TAKES ON CHANDRABABU NAIDU OVER PALNADU TENSIONS MS

పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

అసెంబ్లీ ఫర్నీచర్‌ను కూడా దొంగిలించి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఆరోపించారు.దమ్ముంటే పల్నాడుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

    గుంటూరు జిల్లా పల్నాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. టీడీపీ శరణార్థుల శిబిరం పేరుతో గుంటూరు నడిబొడ్డులో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పల్నాడు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.అసలు పల్నాడు గురించి చంద్రబాబుకు ఏం తెలుసని నిలదీశారు.వైఎస్ఆర్,కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో పల్నాడు అభివృద్ది జరిగిందని.. చంద్రబాబు హయాంలో పల్నాడుకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు.

    వైఎస్ జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పల్నాడులో మెడికల్ కాలేజ్ మంజూరు చేశారని గుర్తుచేశారు.పల్నాడులో శాంతిని నెలకొల్పి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఇదంతా చూసి ఓర్వలేకనే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కూడా దొంగిలించి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఆరోపించారు.దమ్ముంటే పల్నాడుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. వైసీపీ శ్రేణులు కూడా ఆత్మకూరుకు వెళ్తున్నాయని.. టీడీపీ బాధితులతో కలిసి ఆందోళన చేపడుతామని చెప్పారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Guntur, Kasu mahesh reddy, Palnadu, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు