ఓటింగ్ డాన్స్...పోలింగ్ కేంద్రం ముందు స్టెప్పులేసిన ఓటర్

జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ, బారాముల్లా లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

news18-telugu
Updated: April 11, 2019, 2:50 PM IST
ఓటింగ్ డాన్స్...పోలింగ్ కేంద్రం ముందు స్టెప్పులేసిన ఓటర్
ఓటర్ డాన్స్
news18-telugu
Updated: April 11, 2019, 2:50 PM IST
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18 రాష్ట్రాల్లో 91 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటుతో దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరారు. తమ విలువైన ఓటును వేసేందుకు క్యూకట్టారు. ఐతే కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణలు జరుగుతుండగా...మరికొన్ని చోట్ల ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఐతే జమ్మూకాశ్మీర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్ దగ్గర ఓ ఓటర్ సందడి చేశాడు. ఓటు వేసే ముందు డాన్స్ చేసి అందరినీ అలరించాడు.

బందిపోరాలో ఓటు వేసేందుకు క్యూకట్టారు జనాలు. పోలింగ్ కేంద్రం బయట బారులుతీరి ఓటును వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో డార్క్ కలర్ స్లీవ్‌లెస్ స్వెటర్ ధరించిన ఓ వ్యక్తి డాన్స్ చేసి సందడిచేశాడు. ఓట్ల పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి అందరి ఉత్సాహపరిచాడు. 40 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ, బారాముల్లా లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భద్రతా బలగాల తుపాకీ నీడలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...