కాంగ్రెస్ కోసం వెట్టిచాకిరిలా పనిచేశా...మాజీ సీఎం ఆవేదన

తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కోసం 14 మాసాలుగా తాను వెట్టిచాకిరిలా పనిచేశానని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వారు తనను ఎందుకు నిందిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.

news18-telugu
Updated: August 6, 2019, 12:45 PM IST
కాంగ్రెస్ కోసం వెట్టిచాకిరిలా పనిచేశా...మాజీ సీఎం ఆవేదన
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (File)
  • Share this:
సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్ కోసం తాను 14 మాసాల పాటు వెట్టిచాకిరిలా పనిచేశానని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. అయితే తన శ్రమకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కుమారస్వామి నేతృత్వంలోని 14 మాసాల కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు జులై 23న కూలిపోవడం తెలిసిందే. 16 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి బలపరీక్షలో విఫలమయ్యారు. బీజేపీకి చెందిన యడియూరప్ప ఆ రాష్ట్ర సీఎంగా జులై 26న ప్రమాణస్వీకారం చేశారు.

తన సర్కారు కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ కుమారస్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు అందరికీ తాను పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చివరకు కార్పొరేషన్ ఛైర్మన్లకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చానన్నారు. 14 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఎమ్మెల్యేల కోసం తాను ఓ వెట్టిచాకిరిలా పనిచేశానన్నారు. అయితే  ప్రభుత్వం కూలిపోవడానికి తనను వారు ఎందుకు నిందిస్తున్నారో తనకు తెలియడం లేదని మండిపడ్డారు.

సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 14 మాసాలుగా తాను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించానని...అయితే తన శ్రమను ఎవరూ గుర్తించడం లేదని బాధగా ఉందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అగ్ర నాయకులు జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హృదయపూర్వకంగా భావించినట్లు తెలిపారు. అయితే కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలకు మాత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకావడం ఇష్టంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకావాలని వారు ఆకాంక్షించినట్లు చెప్పారు. కొందరు నేతలు ఎవరూ వ్యవహరించారో అందరికీ తెలుసని కుమారస్వామి ఎద్దేవా చేశారు.
Published by: Janardhan V
First published: August 6, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading