Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా?.. తెర వెనుక 'ఆపరేషన్ కమల్'

    గతేడాది జేడీఎస్-కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12సార్లు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలిని తమవైపుకు తిప్పుకుని బీజేపీ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

    news18-telugu
    Updated: January 14, 2019, 3:36 PM IST
    కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా?.. తెర వెనుక 'ఆపరేషన్ కమల్'
    కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, సీఎం కుమారస్వామి(File)
    • Share this:
    కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ.. అప్పటి నుంచి ఇప్పటిదాకా 'కుర్చీ' కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఆ ప్రయత్నాలకు కమలదళం మరింత పదును పెట్టింది. 'ఆపరేషన్ కమల్' ద్వారా జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి.. సంక్రాంతి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.

    ఈ నేపథ్యంలోనే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుట్టు చప్పుడు కాకుండా ముంబై తరలించేసింది బీజేపీ. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా.. ఇప్పటివరకు వారు టచ్‌లోకి రాలేదు. దీంతో మున్ముందు బీజేపీ మరింతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోబోతుందా అన్న ఆందోళన జేడీఎస్, కాంగ్రెస్‌లలో నెలకొంది.

    రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి కష్టాలు తప్పవు. కర్ణాటకలో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం పార్టీకి చాలా అవసరం. అది జరగాలంటే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే.. జేడీఎస్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానైనా పోటీ చేయవచ్చు లేదా తన ఉనికి కోసం ఎన్డీయేతో అయినా కలవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు చివరి ప్రయత్నంగా మా నేతలంతా సీరియస్‌గా పనిచేస్తున్నారు.
    కర్ణాటక బీజేపీ సీనియర్ నేత


    గతేడాది జేడీఎస్-కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12సార్లు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలిని తమవైపుకు తిప్పుకుని బీజేపీ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు 10మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని బీజేపీకి మద్దతునిచ్చేందుకు రమేశ్ ప్రయత్నిస్తున్నట్టు వారు భావిస్తున్నారు.


    First published: January 14, 2019, 3:34 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading