ఆంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు

Karnataka Lok Sabha Election 2019 | ఆంబులెన్స్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటకకు చెందిన ఓ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

news18-telugu
Updated: April 18, 2019, 6:37 PM IST
ఆంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు
ఆంబులెన్స్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓ ఓటరు
news18-telugu
Updated: April 18, 2019, 6:37 PM IST
ఆంబులెన్స్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న ఓ కర్ణాటక ఓటరు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల నుంచి సానుకూల స్పందన మాత్రం కరువవుతోంది. మరీముఖ్యంగా పోలింగ్ డే‌ రోజున సెలవుదినం కావడంతో తమ ఇంట్లోనే గడిపేందుకు పట్టణజనం మొగ్గుచూపుతుండడంతో...పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అంతంత మాత్రంగానే ఉంది.

ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కుందపురాకు చెందిన జయశీల పూజారి 20 రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో 3 నెలల పాటు ఆస్పత్రిలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఎలాగైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలన్న అతని సంకల్పం ముందు ఆరోగ్య సమస్యలేవీ అడ్డురాలేకపోయాయి. ఆంబులెన్స్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జయశీల...స్ట్రెచర్‌పై పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

ఓటు హక్కు వినియోగించునేలా ఇతరులకు కూడా స్ఫూర్తిని కలిగించిన జయశీలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...