HOME »NEWS »POLITICS »karnataka union minister sripad naik met accident wife died sk

Shripad naik: రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు.. భార్య, పీఏ మృతి

Shripad naik: రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు.. భార్య, పీఏ మృతి
శ్రీపాద నాయక్ కారుకు ప్రమాదం

shripad naik: కేంద్రమంత్రి కారుకు ఘోర రోడ్డు ప్రమాదం... భార్య మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్నాటక సీఎం యడ్యూరప్ప, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడారు. కేంద్రమంత్రి శ్రీపాదకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

  • Share this:
    కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ (Sripad naik) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి భార్య విజయ నాయక్‌తో పాటు ఆయన పీఎ మరణించారు. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుకా హోసకంబి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ కారు కర్నాటకలోని యల్లాపుర నుంచి గోవాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీపాదయ నాయక్‌‌కు తీవ్ర గాయాలు కావడంతో.. ఆయన్ను హుటాహుటిన గోవాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెళ్లారు. శ్రీపాద నాయక్‌ పరిస్థితితో పాటు ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.





    ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్నాటక సీఎం యడ్యూరప్ప, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రమంత్రి శ్రీపాదకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:January 11, 2021, 22:14 IST