మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. ముంబైలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు అక్కడకు చేరుకున్నారు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్.
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటివరకు కర్నాటక వరకే పరిమితమైన రాజకీయాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. తాజాగా రెబెల్ ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌పై పిటిషన్ దాఖలు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం... దీనిపై గురువారం విచారణ చేపట్టనుంది.
మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. ముంబైలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు అక్కడకు చేరుకున్నారు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్. అయితే ఆయనను ముంబై పోలీసులు అడ్డుకున్నారు. హోటల్లోకి వెళ్లకుండా భారీగా మోహరించారు. దీంతో వారితో చర్చలు జరిపి సంక్షోభానికి ముగింపు పలకాలన్న ఆయన అశలు అడియాసలైనట్టే కనిపిస్తున్నాయి. మరోవైపు, తమకు ముఖ్యమంత్రి కుమారస్వామిని కానీ, డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు మరింత భద్రత కల్పించాలని కోరారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.