KARNATAKA POLITICAL CRISIS SPEAKER SETS 6PM DEADLINE FOR FLOOR TEST MS
Karnataka Crisis : స్పీకర్ డెడ్లైన్.. సాయంత్రం 6గం. లోపు విశ్వాస పరీక్ష..
స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్
Karnataka Political Crisis : ఒకవేళ నేడు విశ్వాస పరీక్ష జరగకపోతే గనుక.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసే అవకాశం ఉంది. విశ్వాసపరీక్షపై స్పీకర్ తీరు పట్ల ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న గవర్నర్.. నేడు కూడా అది జరగకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.
కర్ణాటక రాజకీయంలో 'బలపరీక్ష'పై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది.సోమవారం మధ్యాహ్నం 3గం.కు విశ్వాస పరీక్ష ప్రారంభించి సాయంత్రం 6గంటల లోపు పూర్తి చేస్తానని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు గతం వారం రోజులుగా రేపు.. మాపు.. అంటూ విశ్వాస పరీక్ష వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం(జులై 22) అయినా విశ్వాస పరీక్ష జరుగుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అన్న ఉత్కంఠ రేగింది. ఎలాగైనా సరే నేడు విశ్వాసపరీక్ష జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరగా.. బలపరీక్షను బుధవారం వరకు వాయిదా వేయాలని సీఎం కుమారస్వామి కోరారు. అయితే స్పీకర్ మాత్రం విశ్వాసపరీక్ష వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.
రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి.. తనను కలవాలని ఆదేశించారు. ఒకవేళ నేడు విశ్వాస పరీక్ష జరగకపోతే గనుక.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసే అవకాశం ఉంది. విశ్వాసపరీక్షపై స్పీకర్ తీరు పట్ల ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న గవర్నర్.. నేడు కూడా అది జరగకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నాం రెండో సెషన్లో స్పీకర్ విశ్వాస పరీక్షను చేపట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద కర్ణాటక అనిశ్చితి రాజకీయాల్లో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందనే చెప్పాలి. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టినా.. లేక గవర్నర్ చట్టపరమైన చర్యలకు సిద్దమైనా.. సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడినట్టే.
సుప్రీంకోర్టు కూడా నావల్లే జాప్యం జరిగిందని అంటోంది. నాకు ఎవరిపైనా పక్షపాతం లేదు.రాజ్యాంగంలో ఎలాంటి నిర్ణయమైనా చట్ట ప్రకారమే. వ్యవహారం గవర్నర్ వరకు వెళ్లకుండాఇక్కడే పూర్తి చేస్తాను.సభ్యులు సంయమనం పాటించి సహకరించాలి. నేను ఇవాళే రూల్ పాస్ చేస్తా. సీఎం నన్ను రెండు రోజులు సమయం కోరారు. కానీ కుదరదు. మధ్యాహ్నాం 3గం.కు బలపరీక్ష ప్రారంభించి సాయంత్రం 6గం. లోపు పూర్తి చేస్తాను.
— కేఆర్ రమేష్ కుమార్, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.