Home /News /politics /

KARNATAKA POLITICAL CRISIS RESIGNATIONS NOT IN ORDER SAYS KARNATAKA SPEAKER

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు...ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ మెలిక

పతనం అంచున కుమారస్వామి సర్కారు

పతనం అంచున కుమారస్వామి సర్కారు

Karnataka Political Crisis | రెబల్ ఎమ్మెల్యేలు సరైన ఫార్మెట్‌లో లేనందున, 8 మంది ఎమ్మెల్యేలు తనను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదేశించారు. అప్పటి వరకు రాజీనామాలపై నిర్ణయం తీసుకోలేనని స్పష్టంచేశారు.

ఇంకా చదవండి ...
    కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని స్పీకర్ కోరారు. రాజీనామాలు సమర్పించిన 14 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది రాజీనామాలు సరైన్ ఫార్మెట్‌లో లేవని ఆయన స్పష్టంచేశారు. సంబంధిత రెబల్ ఎమ్మెల్యేలు నేరుగా తనను కలిసి వివరణ ఇస్తేనే, వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోగలనని స్పష్టంచేశారు.

    అటు తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శివాజీనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్‌ బేగ్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించారు. అయితే రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని రోషన్‌ బేగ్‌ స్పష్టంచేయడం విశేషం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని బేగ్‌ను ఇటీవల కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. బేగ్‌ నిర్ణయంతో రాజీనామా చేసిన కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 15కు పెరిగింది.

    అటు కుమారస్వామి సర్కారు మైనార్టీలో పడిపోయిందని, తక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కర్ణాటక రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అవసరమైన మెజార్టీ లేకున్నా సీఎం పదవిలో కుమారస్వామి కొనసాగడానికి నిరసనగా గాంధీ విగ్రహం, విధానసౌధ ఎదుట బుధవారం నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Karnataka, Karnataka bjp, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు