HOME »NEWS »POLITICS »karnataka political crisis latest updates independent mla nagesh withdraws support to congress jds govt ms

మరో ఎమ్మెల్యే పోయే.. : పతనం అంచున కుమారస్వామి సర్కార్..

మరో ఎమ్మెల్యే పోయే.. : పతనం అంచున కుమారస్వామి సర్కార్..
కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)

ఇప్పటివరకు 14మంది కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో అసెంబ్లీలో ప్రభుత్వ బలం 103కి పడిపోయింది

  • Share this:
    కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన సీఎం కుమారస్వామి రాజీనామా చేసిన మంత్రులు,కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.. అవేవి సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. సరికదా..రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది.తాజాగా స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ కూడా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపాడు. అంతేకాదు,బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు తాను మద్దతునిస్తానని కూడా వెల్లడించాడు.

    కాగా, కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ 1, స్వతంత్రులు రెండు స్థానాలు దక్కించుకున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్,జేడీఎస్ జతకలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీఎస్పీ, స్వతంత్రులు బయటి నుంచి మద్దతు తెలిపారు. అయితే ఇప్పటివరకు 14మంది కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో అసెంబ్లీలో ప్రభుత్వ బలం 103కి పడిపోయింది.స్పీకర్ రమేష్ కుమార్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే చెప్పాలి.



    రాజీనామా లేఖ
    Published by:Srinivas Mittapalli
    First published:July 08, 2019, 11:58 IST

    टॉप स्टोरीज