మాండ్యలో సుమలతకు కాంగ్రెస్ నేతల మద్దతు...జేడీఎస్ కుతకుతలు

Karnataka Loksabha Election | మాండ్య కాంగ్రెస్ నేతల మద్దతు తనకే ఉందంటూ సినీ నటి సుమలత అంబరిష్ ప్రకటించడం పట్ల జేడీఎస్ నేతలు కుతకుతలాడుతున్నారు. సుమలత ప్రకటన కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో చిచ్చురేపే అవకాశముందని భావిస్తున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 6:56 PM IST
మాండ్యలో సుమలతకు కాంగ్రెస్ నేతల మద్దతు...జేడీఎస్ కుతకుతలు
సుమలత,నిఖిల్ గౌడ
  • Share this:
కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలుస్తుండగా...జేడీఎస్ తరఫున ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో నిలుస్తున్నారు. సుమలతకు బీజేపీ మద్దతు ప్రకటించింది. దీంతో అక్కడ సుమలత, నిఖిల్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది. మాండ్య నియోజకవర్గంలో వారిద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. మిత్ర ధర్మానికి విరుద్ధంగా మాండ్యకు చెందిన కాంగ్రెస్‌ నేతలు సుమలత వెంట నిలవడం పట్ల జేడీఎస్ నేతలు కుతకుతలాడుతున్నారు.

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులో భాగంగా మాండ్యను జేడీఎస్ దక్కించుకుంది. అయితే మాండ్యాలోని కాంగ్రెస్ నేతల మద్దతు కూడా తనకే ఉందని సుమలత ప్రకటించారు. తన వెంట నిలుస్తున్న స్థానిక నేతలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకున్నా...వారు తన వెంటే ఉంటారని ధీమా వ్యక్తంచేశారు. సుమలత ప్రకటన జేడీఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మరింత అంతరం తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అటు తనకు మద్దతు ఇవ్వడం పట్ల బీజేపీకి సుమలత కృతజ్ఞతలు తెలిపారు. మాండ్యాలో పోటీని తేలిగ్గా తీసుకోవడం లేదన్న ఆమె, ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని వర్గాల ప్రజల మద్దతు తీసుకుంటామని చెప్పారు. మహిళల నుంచి తనకు విశేష మద్దతు లభిస్తున్నట్లు సుమలత తెలిపారు.

First published: March 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు