Home /News /politics /

Karnataka Floor Test | కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా.. సభలోనే బీజేపీ ఎమ్మెల్యేలు

Karnataka Floor Test | కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా.. సభలోనే బీజేపీ ఎమ్మెల్యేలు

సీఎం కుమారస్వామి(File)

సీఎం కుమారస్వామి(File)

Kumaraswamy Floor Test | కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు రాత్రి సభలోనే కూర్చుని నిరసన తెలపాలని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

  కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన ఆదేశాలను లైట్ తీసుకున్నారు. బలపరీక్ష నిర్వహించకుండా సభను రేపటికి వాయిదా వేయడంపై విపక్ష బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ రోజు రాత్రి సభలోనే కూర్చుని నిరసన తెలపాలని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మరోవైపు అటార్నీ జనరల్‌ను కలిసేందుకు వెళ్లిన స్పీకర్ రమేష్ కుమార్.. సభ వాయిదా పడే సమయానికి హౌస్‌కు రాలేదు.

  అంతకు ముందు కర్ణాటక అసెంబ్లీలో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. బలపరీక్ష జరపకుండా స్పీకర్ రమేష్ కుమార్ తాత్సారం చేస్తున్నారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అదే సమయంలో ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి హోటళ్లలో ఉంచారంటూ కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో వ్యవహారం గవర్నర్ వద్దకు వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ షెట్టర్ నేతృత్వంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ వాజుభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా.. స్పీకర్ రమేష్ కుమార్‌‌ను ఆదేశించారు. అయితే, రేపటికి వాయిదా వేశారు.
  First published:

  Tags: Hd kumaraswamy, Karnataka bjp, Karnataka political crisis

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు