news18-telugu
Updated: January 30, 2020, 5:15 PM IST
జగన్‌తో కుమారస్వామి
ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని అధికార పార్టీలు ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంటుండగా... తాజాగా కర్ణాటకలోని జేడీఎస్ సైతం ప్రశాంత్ కిశోర్ ఐడియాలను ఫాలో కావాలని నిర్ణయించుకుంది. కర్ణాటకలో నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా ఉంటూ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జేడీఎస్... కర్ణాటకలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జేడీఎస్ ముఖ్యనేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్వయంగా తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ (File Photo)
త్వరలోనే ఆయనతో సమావేశమవుతామని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమితో జేడీఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని పార్టీలోని కొందరు నేతలు సూచించడం... ఇందుకు ఆ పార్టీ అధినేత దేవేగౌడ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే క్లారిటీ వచ్చిన తరువాతే... దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో జేడీఎస్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని పలు రాజకీయపార్టీలకు గెలుపు వ్యూహాలను అందించే పనిలో ఉన్న ప్రశాంత్ కిశోర్... కర్ణాటకలో జేడీఎస్ కోసం పని చేస్తారేమో చూడాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
January 30, 2020, 5:14 PM IST