మళ్లీ ఎన్నికల బరిలో యంగ్ హీరో... ఈసారి అక్కడి నుంచే ?

Nikhil Kumaraswamy | లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయిన యంగ్ హీరో నిఖిల్... కర్ణాటకలో జరగనున్న ఉప ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: August 3, 2019, 8:20 PM IST
మళ్లీ ఎన్నికల బరిలో యంగ్ హీరో... ఈసారి అక్కడి నుంచే ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి యంగ్ హీరో నిఖిల్...గత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సీనియర్ నటి సుమలత చేతిలో ఓడిపోయారు నిఖిల్. దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడైన నిఖిల్‌ను ఎలాగైనా రాజకీయాల్లో నిలదొక్కుకునేలా చేయాలని ఆయన కుటుంబం బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి నిఖిల్‌ను ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆయన తండ్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కర్ణాటక రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కర్ణాటకలో పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత పడటంతో... పలు స్థానాల్లో ఉపఎన్నికలు ఖరారయ్యాయి. అందులో జేడీఎస్‌ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించిన కేఆర్ పేట్(కృష్ణరాజ్‌పేట్) కూడా ఉంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో జేడీఎస్ తరపున గెలిచిన నారాయణ గౌడపై అనర్హత వేటు పడటంతో... అక్కడ తమ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిని ఎంపిక చేయడంపై జేడీఎస్ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. మాజీ సీఎం కుమారస్వామి ఇక్కడ పర్యటిస్తుండటంతో... ఆయన తన కుమారుడు నిఖిల్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Nikhil to content in karnatka assembly bypolls,Nikhil gowda to contest from kr pete,kannada hero Nikhil,kumaraswamy son Nikhil,Nikhil kumaraswamy,Nikhil to contest from mandya,కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిఖిల్ పోటీ,కన్నడ హీరో నిఖిల్
కుమారస్వామి తనయుడు నిఖిల్


ఈ అంశంపై దీనిపై స్పందించిన పార్టీ చీఫ్, మాజీ ప్రధాని దేవేగౌడ... పార్టీ నేతలతో చర్చించిన తరువాత అభ్యర్థిని నిర్ణయిస్తామని ప్రకటించారు. పాత మైసూరు ప్రాంతంలో వక్కలిగ వర్గానికి బలమైన పట్టున్న ఈ స్థానం నుంచి ఈ సారి నిఖిల్ గౌడ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి లోక్ సభ ఎన్నికల బరిలో ఓడిన తన కుమారుడిని మాజీ సీఎం కుమారస్వామి అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలుపుతారేమో చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: August 3, 2019, 8:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading