Home /News /politics /

Karnataka Floor Test | ఇవాళే బలపరీక్ష.. స్పీకర్‌కు గవర్నర్ ఆదేశం

Karnataka Floor Test | ఇవాళే బలపరీక్ష.. స్పీకర్‌కు గవర్నర్ ఆదేశం

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు (ANI)

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు (ANI)

Karnataka Floor Test | ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజుభాయ్ వాలా.. స్పీకర్ రమేష్ కుమార్‌కు సూచించారు.

    కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వానికి ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా స్పీకర్ రమేష్ కుమార్‌కు సూచించారు. స్పీకర్ నుంచి వచ్చిన సమాచారాన్ని స్పీకర్ రమేష్ కుమార్ సభకు తెలిపారు. అంతకు ముందు బలపరీక్షకు సంబంధించిన ప్రక్రియ కొనసాగకపోవడంతో బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఇవాళే బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ.. బీజేపీ నేతలు జగదీష్ శెట్టి నేతృత్వంలో గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజ్‌భవన్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. అయితే, స్పీకర్ ఏం చేయాలనే అంశాన్ని గవర్నర్ చెప్పకూడదంటూ కాంగ్రెస్ సభ్యులు వాదించారు. అసెంబ్లీలో ఏం చేయాలనే అంశంపై సర్వహక్కులు స్పీకర్‌కు ఉంటాయని అన్నారు. ఒకవేళ అర్థరాత్రి 12 అయినా సరే.. బలపరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప సభలో డిమాండ్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bjp, Congress-jds, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు