HOME »NEWS »POLITICS »karnataka crisis four congress mlas did not go to raj bhavan after resignation ba

కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నలుగురు ఎమ్మెల్యేలు యూ టర్న్?

కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నలుగురు ఎమ్మెల్యేలు యూ టర్న్?
కర్ణాటక విధానసౌధలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు

Karnataka Crisis | సోమశేఖర్, బైరాతి బసవరాజ్, మునిరత్న, రామలింగారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. దీంతో వారు తమ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గినట్టేనని కాంగ్రెస్ భావిస్తోంది.

  • Share this:
    కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 14 మంది రాజీనామాలు చేశారు. అయితే, ఈ రోజు ఒక్కరోజే.. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. తమ రాజీనామా లేఖలతో విధానసౌధకు వెళ్లారు. అయితే, అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గంటపాటు వెయిట్ చేశారు. అదే సమయంలో మంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. అదే సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ లేఖలతో గవర్నర్ వాజుభాయ్ వాలాను కలవడానికి వెళ్లారు. అయితే, వారి వెంట నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లలేదు. సోమశేఖర్, బైరాతి బసవరాజ్, మునిరత్న, రామలింగారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. దీంతో వారు తమ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గినట్టేనని కాంగ్రెస్ భావిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:July 06, 2019, 16:15 IST

    टॉप स्टोरीज