HOME » NEWS » politics » KARNATAKA COUNCELLOR ALLEGES SHE HAD TO UNDERGO ABORTION AFTER ASSAULT BY BJP MLA SK

గర్భిణీపై బీజేపీ ఎమ్మెల్యే దాడి.. కిందపడడంతో మహిళా కౌన్సిలర్‌కు అబార్షన్..

ఎన్నికల్లో ఓటు వేసేందుకు కౌన్సిలర్ చాందిని నాయక్‌‌ను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకున్నారు. గర్భవతి అయిన ఆమె కింద పడిపోవడంతో.. గర్భస్రావం అయింది.

news18-telugu
Updated: December 1, 2020, 5:30 PM IST
గర్భిణీపై బీజేపీ ఎమ్మెల్యే దాడి.. కిందపడడంతో మహిళా కౌన్సిలర్‌కు అబార్షన్..
కౌన్సిలర్‌ను అడ్డుకుంటున్న ఎమ్మెల్యే, అనుచరులు
  • Share this:
కర్నాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. సొంత పార్టీకి చెందిన మహిళా నేతపై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి గర్భస్రావమయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నాటక రాజకీయాల్ల ప్రకంపనలు రేపుతోంది. బీజేపీకి చెందిన చాందిని నాయక్ మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. తనపై ఎమ్యేలే సిద్దూ సవధి దాడి చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసి. అంతేకాదు చాందినీ నాయక్‌పై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేస్తున్న వీడియో కన్నడ టీవీ ఛానెళ్లలో ప్రసారమయింది. గత నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నవంబరు 9న మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కి సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు వెళ్లారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు కౌన్సిలర్ చాందిని నాయక్‌‌ను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకున్నారు. గర్భవతి అయిన ఆమె కింద పడిపోవడంతో.. గర్భస్రావం అయింది. ఈ ఘటనపై చాందినీ నాయక్, ఆమె నగరేష్ నాయక్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై సిద్దూ సవధిపై ఫిర్యాదు చేశారు.

''ఎమ్మెల్యే సిద్దు రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన.. మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? ఇలాంటి నాయకులు వల్లే రాజకీయాల్లోకి వచ్చేందుకు మహిళలు భయపడుతున్నారు. ప్రధాని బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినాదాలు చేస్తారు. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు.'' అని చాందినీ నాయక్ మండిపడ్డారు.

ఆమె ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే సిద్దు సవధి.. ‘చాందిని నాయక్‌ ఆస్పత్రి రికార్డులు సేకరించాం. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు చెప్పారు.'' అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. మహిళపై ఇంత అమానుషంగా ప్రవర్తించినా.. బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీలో ఇలాంటి సంస్కృతి సాధారణని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ విరుచుకుపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 1, 2020, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading