రిసార్టులో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారా?.. కర్ణాటక కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..?

బీజేపీ మాత్రం.. ఇంకా ఎన్నాళ్లని కాంగ్రెస్ పార్టీ తమను నిందిస్తుందని, తమలో తమకే విభేదాలు ఉన్నాయన్న సంగతి ఇకనైనా ఒప్పుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని చెప్పడానికి.. ఈగల్‌టన్ రిసార్టులో జరిగిన గొడవ కంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం ఉంటుంది? అని బీజేపీ ప్రశ్నించింది.

news18-telugu
Updated: January 20, 2019, 3:26 PM IST
రిసార్టులో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారా?.. కర్ణాటక కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటక కాంగ్రెస్‌ని కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. రిసార్టులో ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవపడి.. అది కాస్త ఘర్షణకు దారితీసినట్టుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. జేఎన్ గణేశ్ అనే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యే తలపై బాటిల్‌తో దాడి చేయడంతో ఆయన గాయపడినట్టుగా అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారాన్ని ఖండిస్తుండగా.. బీజేపీ మాత్రం 'అక్కడ పరిస్థితులు సవ్యంగా లేవు.. ఏదో జరుగుతోంది' అని చెబుతోంది.

ఇదే విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం పరమేశ్వర.. ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో చేరడంపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో ఉన్నాడని మీడియా చెబుతోందని.. ఒకవేళ అదే నిజమైతే తనకూ సమాచారం వస్తుందని అన్నారు. ఇప్పటికైతే తనవద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు. దీనిపై డీకే శివకుమార్‌తో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మరోవైపు డీకె శివకుమార్ మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా తప్పు పట్టారు.

ఇదో ఫేక్ న్యూస్. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. ఎమ్మెల్యేలంతా కలిసిమెలిసే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది. శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకాని నేతలు సైతం త్వరలోనే పార్టీతో చేరుతారని భావిస్తున్నాను.
డీకె శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత


మరోవైపు బీజేపీ మాత్రం.. ఇంకా ఎన్నాళ్లని కాంగ్రెస్ పార్టీ తమను నిందిస్తుందని, తమలో తమకే విభేదాలు ఉన్నాయన్న సంగతి ఇకనైనా ఒప్పుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని చెప్పడానికి.. ఈగల్‌టన్ రిసార్టులో జరిగిన గొడవ కంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం ఉంటుంది? అని బీజేపీ ప్రశ్నించింది.ఇది కూడా చదవండి : మళ్లీ 'రిసార్ట్' రాజకీయం.. కర్ణాటక కాంగ్రెస్‌లో కలవరం..
First published: January 20, 2019, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading