HOME »NEWS »POLITICS »karnataka cm kumaraswamy meet chandrababu naidu

రాహుల్ దూతగా బాబు వద్దకు కుమారస్వామి..!

రాహుల్ దూతగా బాబు వద్దకు కుమారస్వామి..!
రాహల్ గాంధీని కలసిన మరుసటి రోజే చంద్రబాబుతో భేటీ అయిన కుమారస్వామి

నిన్న రాహుల్ గాంధీని కలసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. మరుసటి రోజు చంద్రబాబునాయుడితో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    కర్ణాటక సీఎం విజయవాడ ఎందుకు వచ్చారు? స్వామికార్యం కోసం వచ్చారా? స్వకార్యం కోసం వచ్చారా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కర్ణాటక ముఖ్యమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్న కుమారస్వామి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. అయితే, నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన కర్ణాటక సీఎం.. మరుసటిరోజే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలోని ఓ హోటల్లో చంద్రబాబు, కుమారస్వామి ప్రత్యేకంగా సమావేశమై.. సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు.  మోదీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకం చేయడంపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన కుమారస్వామి.. మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెబుతున్నా.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

    దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. ఈక్రమంలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఏపీ ముఖ్యమంత్రి కూడా హాజరై.. రాహుల్ గాంధీతో వేదికను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో రాహుల్ గాంధీ దూతగానే కుమారస్వామి చంద్రబాబును కలిసి ఉండవచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.




    రాహుల్‌తో కుమారస్వామి సమావేశమైన రోజే.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. తెలంగాణలో పొత్తులు ఉంటాయని హస్తం పార్టీ, సైకిల్ దోస్తీ కడతాయంటూ ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు తీసుకుని.. వాటిని కుమారస్వామి ద్వారా చంద్రబాబుకు చేరవేశారా? అనే చర్చ కూడా ప్రారంభమైంది.

    ఇది కూడా చదవండి
    Published by:Ashok Kumar Bonepalli
    First published:August 31, 2018, 11:33 IST

    टॉप स्टोरीज