Home /News /politics /

KARNATAKA CM BASAVARAJ BOMMAI TO BE LATEST IN FATHER SON DUO CLUB TO BE IN CHIEF MINISTER POST HERE IS FULL LIST SK

Father Son CM Posts: తండ్రి బాటలో తనయులు.. సీఎంగా పనిచేసిన తండ్రీకొడుకు వీళ్లే..

బసవరాజ్ బొమ్మై, వైఎస్ జగన్

బసవరాజ్ బొమ్మై, వైఎస్ జగన్

సీఎంగా పనిచేసిన తండ్రీకొడుకులు చాలా మందే ఉన్నారు. వైఎస్ జగన్-వైఎస్ రాజశేఖర్ రెడ్డి, స్టాలిన్-కరుణానిధి, కుమారస్వామి-దేవెగౌడ ఈ జాబితాలోకే వస్తారు. మరి ఒకే ఫ్యామిలీ నుంచి సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి.

    కర్నాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. బసవరాజ్ బొమ్మై కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 1988- 1989లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కర్ణాటక సీఎంగా పనిచేశారు. వీరు మాత్రమే కాదు.. సీఎంగా పనిచేసిన తండ్రీకొడుకులు చాలా మందే ఉన్నారు. వైఎస్ జగన్-వైఎస్ రాజశేఖర్ రెడ్డి, స్టాలిన్-కరుణానిధి, కుమారస్వామి-దేవెగౌడ ఈ జాబితాలోకే వస్తారు. మరి ఒకే ఫ్యామిలీ నుంచి సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి.

    తండ్రి బాటలో తనయులు:
    కర్నాటక:
    గతంలో ఎస్‌ఆర్ బొమ్మై కర్నాటక సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు బీ.ఆర్. బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

    కర్నాటక సీఎంగా హెచ్‌.డీ. దేవెగౌడ 1994 నుంచి 1996 వరకు పనిచేశారు. ఆయన కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి కూడా రెండు సార్లు కర్నాటక సీఎంగా సేవలందించారు..

    తమిళనాడు:
    తమిళనాడులో 1969 నుంచి 2011 మధ్య కరుణానిధి 5 సార్లు సీఎంగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడంతో ఆయన కుమారుడు స్టాలిన్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

    ఆంధ్రప్రదేశ్:
    వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2009 మధ్య రెండు సార్లు ఉమ్మడి సీఎంగా సేవలందించారు. తండ్రి మరణం తర్వాత వైసీపీ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

    ఒడిశా:

    నవీన్ పట్నాయక్ 2000 నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి బిజూపట్నాయక్ కూడా సీఎంగా పనిచేశారు. 1961-63, 1990-95లో బిజూ పట్నాయక్ ఒడిశా సీఎంగా సేవలందించారు.

    అరుణాచల్ ప్రదేశ్:
    ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్న పెమా ఖండు తండ్రి దోర్జి ఖండు కూడా గతంలో సీఎంగా పనిచేశారు. 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.

    ఝార్ఖండ్:
    ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ కూడా గతంలో సీఎంగా పనిచేశారు. మూడు సార్లు ఆయన సీఎంగా సేవలందించారు.

    జమ్మూకాశ్మీర్:
    జమ్మూకాశ్మీర్‌లో అబ్దుల్లా ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వారు సీఎం పదవిలో ఉన్నారు. షేక్ అబ్దులా తర్వాత, ఆయన కుమారుడు ఫరూఖ్ అబ్దుల్లా సీఎంగా పనిచేశారు. ఫరూఖ్ అబ్దుల్లా తర్వాత ఒమర్ అబ్దుల్లా కూడా ముఖ్యమంత్రిగా సేవలందించారు.

    గతంలో జమ్మూకాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రే.

    ఉత్తరప్రదేశ్:
    ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎంగా పనిచేశారు. 2012 నుంచి 2017 వరకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.

    ఉత్తరాఖండ్:
    ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన విజయ్ బహుగుణ తండ్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఆయన పనిచేశారు.

    హర్యానా:
    దేవి లాల్ హర్యానా సీఎంగా పనిచేశారు. ఆయన తండ్రి ఓం ప్రకాశ్ చౌతలా కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు.

    మహారాష్ట్ర:
    శంకర్ రావ్ చవాన్‌తో పాటు ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు.

    నందమూరి తారకరామారావు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా మూడు సార్లు సీఎం పదవిలో ఉన్నారు. అంతేకాదు తండ్రులు ముఖ్యమంత్రిగా ఉంటే.. డిప్యూటీ సీఎంగా పనిచేసిన కుమారులు కూడా ఉన్నారు. బీహార్ సీఎంగా లాలు ప్రసాద్ పనిచేయగా.. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ సీఎంగా పనిచేయగా.. ఆయన కుమారుడు సుఖ్‌బిర్ సింగ్ బాదల్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Basavaraj Bommai, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు