Home /News /politics /

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రాజీనామా ఆలోచనలో కుమారస్వామి..

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రాజీనామా ఆలోచనలో కుమారస్వామి..

సీఎం కుమారస్వామి(File)

సీఎం కుమారస్వామి(File)

గురువారం ఉదయం 11గంటలకు కేబినెట్‌ను సమావేశపరిచి రాజీనామా విషయాన్ని మొదట వారికి వెల్లడించనున్నారు. అనంతరం గవర్నర్‌ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖ సమర్పించనున్నారు.

    కర్ణాటక రాజకీయ సంక్షోభం నేడు క్లైమాక్స్‌కు చేరే అవకాశం కనిపిస్తోంది. సీఎం కుమారస్వామి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బుధవారం రాత్రి నుంచి ఆయన తన తండ్రి, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో చర్చలు జరుపుతున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు దారికొచ్చే పరిస్థితి లేకపోవడం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో.. ఇక తప్పుకోవడమే సరైందని కుమారస్వామి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం 11గంటలకు కేబినెట్‌ను సమావేశపరిచి రాజీనామా విషయాన్ని మొదట వారికి వెల్లడించనున్నారు. అనంతరం గవర్నర్‌ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖ సమర్పించనున్నారు.మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రాజీనామాలపై స్పీకర్ జాప్యం చేస్తున్నారని వారు సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు వెలువడకముందే రాజీనామా చేసి తప్పుకోవాలని కుమారస్వామి ఆలోచిస్తున్నారు.

    బుధవారం ముంబై వెళ్లి రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మంత్రి డీకె శివకుమార్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. శివకుమార్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన్ను హోటల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాత్రి 10గంటల వరకు అక్కడే ఉన్న శివకుమార్.. ఇక చేసేదేమి లేక 10.30గంటలకు బెంగళూరు బయలుదేరి వెళ్లారు. బెంగళూరుకు చేరుకున్న వెంటనే నేరుగా దేవెగౌడ ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించారు. అప్పటికే సీఎం కుమారస్వామి తండ్రి దేవెగౌడతో చర్చలు జరుపుతున్నారు. శివకుమార్‌తోనూ చర్చించిన తర్వాత కుమారస్వామి ఇక రాజీనామాయే సబబు అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
    First published:

    Tags: Congress, Devegowda, Hd kumaraswamy, Jds, Karnataka, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు