ప్రకాశ్ రాజ్‌కు క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ

ఫ్రకాశ్ రాజ్(ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిని విమర్శించినందుకు గానూ 2017 అక్టోబర్‌లో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంపీ ప్రతాప్ సింహా. దీనికి స్పందించిన ప్రకావ్ రాజ్... ఎంపీ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసులు పంపించారు ప్రకాశ్ రాజ్.

 • Share this:
  కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నటుడు ప్రకాశ్ రాజ్‌కు క్షమాపణలు చెప్పారు. 2017లో సోషల్ మీడియా ద్వారా ప్రకాశ్ రాజ్‌పై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన ఎంపీ ప్రతాప్... కోర్టు ఆదేశాల మేరకు ప్రకాశ్ రాజ్‌కు గురువారం ట్విట్ ద్వారా క్షమాపణలు చెప్పారు. గతంలో తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించాయని... వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎంపీ ప్రతాప్ సింహా తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అన్నారు.
  దీనిపై ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. మీ క్షమాపణలను స్వీకరిస్తున్నానని ఎంపీకి సమాధానమిచ్చిన ప్రకాశ్ రాజ్... సోషల్ మీడియాలో ఈ రకమైన దాడి చేసుకోవడం సరికాదని కామెంట్ చేశారు. మన సిద్ధాంతాల్లో తేడా ఉండవచ్చునని అయినా ఈ రకంగా వ్యవహరించకూడదని అన్నారు.
  ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిని విమర్శించినందుకు గానూ 2017 అక్టోబర్‌లో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంపీ ప్రతాప్ సింహా. ఇందుకు ప్రతిగా ఎంపీ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసులు పంపించారు ప్రకాశ్ రాజ్. ఆ తరువాత ప్రకాశ్ రాజ్‌పై ఎంపీ ప్రతాప్ అదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎంపీ తనకు క్షమాపణలు చెప్పాలని... లేకపోతే రూ. 1 పరువునష్టం కింద చెల్లించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఎంపీ ప్రతాప్ ప్రకాశ్ రాజ్‌కు క్షమాపణలు చెప్పాలని ఆదేశించడంతో... చివరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకాశ్ రాజ్‌కు సారీ చెప్పారు.
  Published by:Kishore Akkaladevi
  First published: